ఆ విషయంలో రోజా మారితే బెటర్.. జగన్ పాలన బాగుంది కానీ?

సినీ నటిగా, రాజకీయ నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో రోజా ఒకరు. వైసీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ప్రస్తుతం మంత్రి పదవిని పొందారు. అయితే రోజా ఎక్కడికి వెళ్లినా జగన్ ను పొగుడుతూ వైసీపీ పథకాల గురించి ప్రచారం చేస్తున్నారే తప్ప మంత్రిగా తను ప్రజలకు ఎలాంటి మేలు చేస్తున్నారో చెప్పడంలో మాత్రం విఫలమవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రవాసాంధ్రుల పిలుపు మేరకు రోజా ప్రస్తుతం తన భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడ రోజా ఏపీ సీఎం జగన్ ను మెచ్చుకోవడంతో పాటు చంద్రబాబు, లోకేశ్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆస్ట్రేలియాలో కూడా రోజా స్పీచ్ రొటీన్ గా సాగిందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం. జగన్ ను పొగిడే క్రమంలో రోజా ఒకింత హద్దులు దాటుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి రోజాకు సొంత పార్టీలోనే కొంతమంది నేతలతో పొసగడం లేదు. రోజాకు మంత్రి పదవి దక్కకుండా కొంతమంది తీవ్రస్థాయిలో కృషి చేశారని కూడా కామెంట్లు వ్యక్తమయ్యాయి. రోజా సొంత పార్టీ నేతలతో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని కొంతమంది నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. రోజా ఈ విషయంలో మారతారో లేదో చూడాల్సి ఉంది.

అయితే ఎమ్మెల్యేగా మాత్రం రోజా భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూడా రోజా ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించడం గ్యారంటీ అని తెలుస్తోంది. రోజాను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.