ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం (ఎక్స్ క్లూజివ్ వీడియో)

ఉప్పల్ బస్టాప్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాబోయే దంపతులు ప్రమాదానికి గురి కావడంతో అమ్మాయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వినీషా, కిరణ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికి రెండు నెలల కిందటే ఎంగేజ్ మెంట్ అయ్యింది. మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు.

యాదాద్రి దర్శనానికి వెళుతుండగా ఉప్పల్ లో వీరు ప్రయాణిస్తున్న బైక్ కింద పడటంతో వెనకు నుంచి వచ్చిన కారు వీరి మీది నుంచి వెళ్లింది. దీంతో వినీషా అక్కడికక్కడే చనిపోగా కిరణ్ కు స్వల్ప గాయాలయ్యాయి. హృదయ విదారకరమైన గాధతో అంతా కన్నీరు పెట్టారు. ప్రమాదం జరిగిన వీడియో కింద ఉంది చూడండి.