ఉప్పల్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

హైదరాబాద్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఉప్పల్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయం వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తుండటం గమనార్హం. మార్చి నెల 4వ తేదీన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.

ఈ ఉద్యోగ ఖాళీలను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ ఈడీ, బీఈడీ, సీటెట్, డిగ్రీ, టెట్, బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతతో పాటు అనుభవం ఉండాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని సమాచారం అందుతోంది.

పీఎం శ్రీ కేవీ నెం.1, ఉప్పల్, రామాంతపూర్ రోడ్, జీ.హెచ్.ఎం.సీ ఆఫీస్ పక్కన కేవీ నం.2, ఉప్పల్, హైదరాబాద్ అడ్రస్ కు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరగనుందని చెప్పవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయంలో జాబ్ చేయాలని భావించే వాళ్లు ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉంటాయి.