హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీల విషయంలో ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పీజీటీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉద్యోగ ఖాళీలతో పాటు టీజీటీ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, సోషల్ సైన్స్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్, ప్రైమరీ టీచర్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈడీ, ఎంఎస్సీ, ఎంఈడీ, సీటెట్, టెట్, డిగ్రీ, బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు 21,250 రూపాయల నుంచి 27,500 రూపాయల వరకు వేతనం లభించనుండటం గమనార్హం.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని తెలుస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత ఉన్నవాళ్లు ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. పీఎం శ్రీ కేవి నం.1, ఉప్పల్, రామాంతపూర్ రోడ్, జీ.హెచ్.ఎం.సీ ఆఫీస్ పక్కన, కేవీ నం.2, ఉప్పల్, హైదరాబాద్ లో ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుందని తెలుస్తోంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజాం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.