యాదాద్రీశుడి సన్నిధిలో ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ దర్శకనిర్మాతలు!

రాజేంద్ర ప్రసాద్‌, మీనా ప్రధాన పాత్రల్లో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’. కోనేరు కల్పన నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో సోహెల్‌, మృణాళిని హీరోహీరోయిన్లుగా నటించారు. కె.అచ్చిరెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమా మార్చి 3న విడుదల కానుంది.

ఇక సినిమా విడుదల సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులతో కలిసి సినిమా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, సమర్పకుడు అచ్చి రెడ్డిలతో కలిసి నిర్మాత కోనేరు కల్పన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ సినిమా విజయవంతం కావాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్దించారు. ఇక అనంతరం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ యూనిట్ సభ్యులకు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.