ఆర్జీవీ ట్వీటు ఏపీలో కులాల కుంపట్లను రగుల్చుతుందా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే. ఆయన ‘కాపు నాయకుడు’ కాదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా అంతే.. ఆయన ‘కమ్మ నాయకుడు’ కాదు.! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అయినా ఇదే వర్తిస్తుంది.

రాజకీయాల్లోకి వచ్చాక, తాను పలానా మతానికి మాత్రమే నాయకుడిననీ, ఫలానా కులానికి మాత్రమే నాయకుడినని ఎవరైనా అనగలరా.? కాకపోతే, తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఉన్నత స్థానంలో వుంటే, ‘మావోడు’ అనే చర్చ ఆయా సామాజిక వర్గాల్లో జరుగుతుందంతే.

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవడమంటే, కాపుల్ని తీసుకెళ్ళి కమ్మలకు అమ్మేయడమేనని రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి మాట్లాడితే ఎలా.? అమ్మాయి కనబడితే కామంతో తగలబడిపోయే రామ్ గోపాల్ వర్మ, ఆ అమ్మాయి కాళ్ళు నాకెయ్యడానికైనా వెనుకాడడు. అలాంటి ఆర్జీవీ, కులాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం కాకపోతే మరేమిటి.?

పైగా, ‘రెస్ట్ ఇన్ పీస్ కాపులు’ అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ పెను వివాదానికి కారణమయ్యింది. రామ్ గోపాల్ వర్మ అంటేనే అంత.! జనసేన ఓటు బ్యాంకుని మొత్తంగా పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు పంపలేరు.. ఒకవేళ టీడీపీ – జనసేన పొత్తు కుదిరినాగానీ.! రాజకీయం అంటేనే అంత.

అలాంటిది, ఓ కులాన్ని మొత్తంగా ఇంకొకరికి అమ్మయగల శక్తి ఎవరికి మాత్రం వుంటుంది.? వోడ్కా మత్తులో ఆర్జీవీ వేసే ట్వీటుకి ఏమైనా విలువ వుంటుందా.?