కాంగ్రెస్ పార్టీ యువనేత, ఎంపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని చూసి సొంత వర్గంలో సీరియర్లంతా కుళ్లిపోతున్నారు అనడానికి ఎన్నో సందర్భాలున్నాయి. కొమటిరెడ్డి- ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు ఎవరికి వారు? ఒకే పార్టీలో సొంత కుపట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అవకాశం చిక్కినప్పుడు అదిష్టానం వద్ద బలం నిరూపించుకోవడానికి అస్ర్తాల రూపంలో వాడుతున్నారు. ఇటీవలే వి. హనుమంతురావు యువనేతపై పబ్లిక్ గానే రుసరుసలాడారు. 50 ఏళ్లు దాటిన సీనియర్లను కాదని పీసీసీ పదవి కుర్రాడికి ఎలా ఇస్తారు? ఈ సంగతేంటో అదిష్టానం దగ్గరే తేల్చుకుంటాయనని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత పార్టీలో అంతర్గత యుద్ధం అంతకంతకు హీటెక్కుతోంది. అదిష్టానం దృష్టి రేవంత్ రెడ్డిపై ఉండటం అయనకు కలిసొచ్చే అంశంగా మారడంతో వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలో యవ నేత స్ర్టాంగ్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. సీనియర్లందర్నీ సైడేసి అదిష్టానం వద్ద బలం నిరూపించుకునే ప్రయత్నాల్లో బిజీ అయినట్లు సమాచారం. ఇటీవల ప్రియాంక గాంధీ యంగ్ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజాస్థాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని చేధించి ప్రియాంక గాంధీ రాజకీయాలలో తన ముద్ర వేసారు.
ఈ నేపథ్యంలో ప్రియాంక మెప్పుకోసం రేవంత్ ఇప్పటి నుంచి లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీలో ఉన్న సీనియర్లు అందర్నీ ఒకే తాటిపైకి తీసుకురావడం అన్నది అంత ఈజీగా జరిగేది కాదు. పీసీసీ కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ల కన్నా రేవంత్ పైనే అదిష్టానం దృష్టి కూడా ఉంది కాబట్టి తెలంగాణ టీడీపీ ఓట్లను చంద్రబాబు తో మాట్లాడి తన వైపుకు తిప్పుకునేలా చేస్తానని ఏఐసీసీ తో ఒప్పందం చేసుకోవాలని రేవంత్ సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడీ అంశం ఢిల్లీ సహా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.