తెలంగాణ కాంగ్రెస్ రేసులో పీసీసీ ఎవరికి దక్కుతుందన్న దానిపై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఆ పదవి కోసం ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదిష్టానానికి టచ్ లో ఉంటూ తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాబితాలో సీనియర్ ..జూనియర్లు అంటూ ఎవరూ లేరు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు. ఎవరికి పీసీసీ దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఈ రేసులో బలంగా వినిపిస్తున్న పేరు ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయన వైపే అదిష్టానం ఆసక్తిగా ఉందని మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. పార్టీలో గ్రూప్ రాజకీయాల్ని అధిగమించి తానే బెస్ట్ అనిపించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
కాస్తో..కూస్తో సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఈ ప్లాన్ గనుక ఫెయిలైతే! సొంతంగా పార్టీ పెట్టి! 2023 ఎన్నికల్లో కేసీఆర్ పై ఎటాక్ చేయాలని పక్కా ప్రణాళిక సిద్దంగా ప్లాన్ బీగా ఉందని తెరపైకి వస్తోంది. రేవంత్ టార్గెట్ కేసీఆర్ ని పడగొట్టడం. అందుకోసం నిరంతరం అవిశ్రామంగా శ్రమిస్తారని చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏ పార్టీతోనైనా కలిసి వెళ్తారు! అవసరం మేర పార్టీ కూడా పెట్టేస్తారని తేలిపోయింది. ఏం చేయాలన్నా! ముందు ప్రజల్లో తన బలం నిరూపించుకోవాలి. వాళ్ల నుంచి సానుభూతి అనేది అత్యంత అవసరం. అందుకే ఈ ఫైర్ బ్రాండ్ జగన్ మోహన్ రెడ్డి మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.
జగన్ మోహన్ రెడ్డి తరహాలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ర్టమంతటా పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ వాదులంతా కలిసొస్తే ఓకే! లేదంటే కోదండరామ్ తో కలిసి జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే కేసీఆర్ కి కష్టాలు మొదలైనట్టే. ప్రజల్లో పాదయాత్ర ఎంత బలంగా పనిచేస్తుందో? చెప్పాల్సిన పనిలేదు. రాజశేఖర్ రెడ్డిని..జగన్ మోహన్ రెడ్డిని సీఎం కుర్చీ ఎక్కించింది కూడా ఆ సానుభూతేనన్నది తెలిసిందే.