రేవంత్ రెడ్డి = “బాహుబలి”.. లాజిక్ తో కొట్టిన వర్మ..!

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే రాజకీయాలు అలాగే సినిమాలు కూడా కలిసే ఉంటున్నాయి. కాగా మొన్ననే తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో అయితే టాలీవుడ్ ప్రముఖులు అంతా కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మరి ఎట్టకేలకి ఈరోజు తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి.

రెండు సార్లు అధికారంలోకి వచ్చి మూడోసారి హ్యాట్రిక్ కొడతాం అని ధీమాగా ఉన్న బి ఆర్ ఎస్ పార్టీని ఓడించి తెలంగాణ కాంగ్రెస్ అయితే భారీ విజయాన్ని సొంతం చేసుకొని కొత్త ప్రభుత్వాన్ని స్థాపించింది. అయితే దీనితో తెలంగాణ కొత్త సీఎం గా రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యారని అంతా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యిపోయారు.

కాగా తెలంగాణాలో కాంగ్రెస్ విజయానికి అలాగే రేవంత్ రెడ్డి విజయానికి లింక్ చేస్తూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇది రేవంత్ రెడ్డి విజయ్ కానీ కాంగ్రెస్ విజయం కాదు రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీలు ఒకటి గమనించాలి. మీ దగ్గర బాహుబలి లాంటి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టే గెలిచారు అని లాజిక్ తో కొట్టాడు.

దీనితో ఈ విజయం రేవంత్ రెడ్డిదే తప్ప కాంగ్రెస్ ది కాదని తేల్చి చెప్పేసాడు. మరి ఈ కామెంట్ తో అయితే చాలా మందే వర్మ స్టేట్మెంట్ కి అందరూ అగ్రీ అవుతున్నారు. మొత్తానికి అయితే సినీ ప్రముఖులు చాలా మంది కూడా ఇప్పుడు కాంగ్రెస్ విజయానికి తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.