తెరపైకి తనికెళ్ళ భరణి డైలాగ్… ఈ “జగన్ మహిమ” మోడీకి తెలుసా?

తన ప్రత్యర్థి రామోజీరావుపై ఏపీ సీఎం జగన్ అనుకున్నది సాధించాడు! ఆ దిశగానే జగన్ ఇన్నాళ్లూ అడుగులు వేశాడు. పంతం పట్టినట్టే మార్గదర్శి కేసులో రామోజీకి భారీ షాక్ ఇచ్చాడు. రామోజీరావు కుంభస్థలం మార్గదర్శిపై బలంగా కొట్టేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మార్గదర్శి కేసులో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తూ ఏకంగా రూ.793 కోట్ల విలువైన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. దీంతో రామోజీరావుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.

“మాటిచ్చాడంటే.. చేస్తాడంతే..” అని జగన్ గురించి వైకాపా నాయకులు గొప్పగా చెప్పుకుంటుంటారు. అయితే అది ఇంతకాలం జనాల విషయంలో అనుకున్నారే తప్ప… రామోజీ విషయంలో ఎవరి మాటిచ్చాడో కానీ… మీడియా మొగల్ కు దిమ్మతిరిగే షాకిచ్చాడు జగన్.

ఒకసారి గతానికి వెళ్దాం… చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అన్నదాత మ్యాగజైన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి నెల అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ కార్యాలయాలకు, ప్రభుత్వం సూచించిన రైతులకు అన్నదాత సంచికలు సరఫరా చేస్తామని మాట ఇచ్చింది. ఇది రామోజీ – చంద్రబాబు ల మధ్య అండర్ స్టాండింగ్ తో సాగిపోయింది. అనంతరం ప్రభుత్వం మారింది.. జగన్ కుర్చీ ఎక్కడం జరిగింది. నాటినుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. అనంతరం కొంతకాలానికి అన్నదాత మ్యాగజైన్ అధ్యాయమే ముగిసిపోయింది!

అనంతరం మార్గదర్శి పై మనసుపెట్టారు జగన్! ఇదేసమయంలో ఎప్పటినుంచో మార్గదర్శి అక్రమాలపై పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం… మార్గదర్శి కేసులో ఉన్న లొసుగులు మొత్తం జగన్మోహన్ రెడ్డికి చెప్పేశారనే కామెంట్లు వినిపించాయి. దీంతో జూలు విదిల్చిన జగన్.. సీఐడీని రంగంలోకి దింపారు! రామోజీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఏకంగా 80 ఏళ్ల జీవితంలో రామోజీ ఇంటి గడప తొక్కని పోలీసులు, ఏకంగా విచారణ చేసెలా చేశాడు జగన్!

ఫలితంగా ఎంతోమందిని పడుకోబెట్టిన రామోజీరావును.. నడుముకు బెల్ట్ కట్టుకొని, మంచంలో పడుకునేలా చేసాడనే కామెంట్లు వినిపించాయి. “ఇది కాలమహిమో.. జగన్ మహిమో” అంటూ బెడ్ పై సీఐడీ విచారణను ఎదుర్కొనే సమయంలో రామోజీరావు ఆవేదన చెందారు. అనంతరం జగన్ దూకుడు భరించలేక రామోజీరావు కోర్టుకు వెళ్లినప్పటికీ అంతగా ఊరట లభించలేదు. రామోజీరావు చిట్ ఫండ్స్ వ్యాపారం పేరుతో నిధులను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఆ నివేదికను కోర్టుకు సమర్పించారు. అది విచారణ జరుగుతున్న సమయంలో… ఒక అడుగు ముందుకేసి 730 కోట్ల ఆస్తులను అటాచ్ చేసారు.

అయితే ఈ విషయాలు మోడీకి తెలియదా? అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న! కారణం… హస్తినలోని బీజేపీ పెద్దలతో రామోజీకి మాంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో… ఈ ఒక్క విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలని మోడీ – అమిత్ షా లను జగన్ కోరారని తెలుసుంది. దీంతో… మరో ఆప్షన్ లేక వారిరువురూ జగన్ తో “ఏజ్ యువర్ విష్” అన్నారని సమాచారం. కారణం… వారికి రామోజీ అవసరం కంటే ఎక్కువగా జగన్ అవసరం ఉందనేది జగమెరిగిన సత్యం. ఇంకేముంది ఆ మాత్రం హింట్ ఇస్తే చాలు అల్లుకుపోతానన్నట్లుగా జగన్ జూలు విదిల్చారు.. ఏపీ సీఐడీ దూకుడు పెంచింది.. అంతం కాదిది ఆరంభం మాత్రమే అన్నచందంగా దూసుకుపోతుంది.

దీంతో… “అతడు” సినిమాలో తణికెళ్ల భరణి డైలాగ్ చెప్పుకుంటున్నారు నెటిజన్లు!