రఘురామని చంపేందుకు రైలునే తగలబెట్టేయాలనుకున్నారా.?

Raghurama

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని చంపేందుకు కుట్ర జరుగుతోందా.? ఈ విషయమై ఆయన పదే పదే తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తూనే వున్నారు. తాజాగా, ఆ ఆరోపణలకు టీడీపీ నుంచి కాస్త ‘బలం’ యాడ్ అయ్యింది. రఘురామని చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ నేత బొండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు.

‘రఘురామని సత్తెనపల్లిలో చంపేయడానికి స్కెచ్ వేశారు. అది తెలిసే, రఘురామ జాగ్రత్తపడి.. రైలు దిగేశారు..’ అంటూ బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాగా, తన వెంట ఇంటెలిజెన్స్ పోలీసులు కొందరు కుట్రపూరితంగా ఫాలో అవడం గమనించాననీ, తనను చంపేందుకు కుట్ర జరుగుతున్న వైనంపై సమాచారం రావడంతోనే, భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు వెళ్ళలేకపోయానని రఘురామ ఆరోపించారు.

ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ మీద రఘురామ ఆరోపణల్ని తేలిగ్గా కొట్టిపారేయలేం. చాలా సీరియస్ అంశమిది. పోలీస్ వ్యవస్థ ఈ ఆరోపణలపై స్పందించాలి. రఘురామ ఇంటిపై ఇంటెలిజెన్స్ ఎందుకు నిఘా పెట్టింది.? ఇంటెలిజెన్స్ సిబ్బంది ఆయన ఇంటి వద్ద తచ్చాడటమేంటి.? రఘురామకి చెందిన సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తిని పట్టుకోవడమేంటి.?

ఇవన్నీ చిన్న విషయాలు కావు. కానీ, ఏపీ రాజకీయాల్లో ఇవి సిల్లీ అంశాలుగా మారిపోయాయ్.! ఇలాంటి వ్యవహారాలకు కారకుడయ్యారనే సీనీయర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మీద వైసీపీ సర్కారు రాజకీయ వేధింపులకు దిగుతోంది. మరి, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ మీద వచ్చే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏమో.!

రైళ్ళను తగలబెట్టడం అనేది తెలుగునాట ఫ్యాషన్ అయిపోయింది.. దాన్ని జస్ట్ ఓ పొలిటికల్ విమర్శ కోసం రఘురామ, బొండ ఉమ వాడేశారనుకోవాలా.? నిజంగానే అలాంటి కుట్రలు జరిగాయా.?