రివ్యూ రైటర్ గా మారిన వైసీపీ ఎంపీ… “బ్రో”కి తనవంతు సాయం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ.. “బ్రో” సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మిక్సుడ్ టాక్ తెచ్చుకుందని అంటున్నారు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం… తమిళ మూవీ “వినోదయ సీతం”కు రీమేక్. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం.. ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిచిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా వస్తోన్న రివ్యూలతో పాటు తాజాగా వైసీపీ ఎంపీ కూడా ఈ సినిమాకి ట్విట్టర్ లో రివ్యూ ఇచ్చారు. అందులో భాగంగా ఈ సినిమా కచ్చితంగా చూడాలని అంటున్నారు. పైగా ఈ సినిమాలో చాలా నీతి ఉందని.. అందరూ చూడాలని మాగ్జిమం ప్రమోట్ చేసే పనికి పూనుకున్నారు. కచ్చితంగా చూడాలని నొక్కి వక్కానిస్తున్నారు.

అవును… నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు “బ్రో” సినిమాపై తనదైన రివ్యూని ఇచ్చారు. దీన్ని మస్ట్ వాచ్ మూవీగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాని పవన్ కల్యాన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. ప్రతీ ఒక్కరూ చూడాలని సూచించారు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ ని అభినందించారు.

ఇదే సమయంలో.. ఈ ప్రపంచంలో ఎవ్వరూ శాశ్వతం కాదనే సూత్రాన్ని ఈ సినిమా బోధించిందని రఘురామ ప్రశంసించారు. ఈ సినిమా మావన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిందని వైసీపీ రెబల్ ఎంపీ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, స్క్రీన్‌ప్లే-మాటలు సమకూర్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కు రఘురామ ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెప్పారు.

ఇదే క్రమంలో… ఈ సినిమా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ తన మిత్రుడని చెప్పిన రఘురామ… ఓ మంచి సినిమాను అందించారంటూ అభినందించారు. దర్శకుడు సముద్రఖని, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని పేర్కొన్నారు. ఫైనల్ గా ఓ మంచి చిత్రాన్ని చూశానంటూ వ్యాఖ్యానించారు రఘురామ కృష్ణంరాజు!

కాగా… ఈ సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు పై సెటైర్ వేశారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంత్రి అంబటి.. గిరిజనులతో చేసిన డ్యాన్స్ ను పోలినట్లుగా… థర్టీ ఇయర్స్ ఫృధ్వీతో ఒక పాత్ర చేయించారని.. ఆయనతో సేం డ్రెస్, సేం డ్యాన్స్ చేయించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదే సమయంలో తనపై బ్రో సినిమా ద్వారా చేస్తోన్న ట్రోల్స్ విషయంపై అంబటి రాంబాబు స్పందించారు. తానేమీ పవన్ కల్యాణ్ లా ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ చేసే వ్యక్తిని కానంటూ మొదలుపెట్టిన అంబటి… పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని అభిప్రాయపడ్డారు.

పవన్ తనను రాజకీయంగా ఎదుర్కొలేకపోతున్నారని.. అందుకే సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ సృష్టించి ఆనందం పొందుతున్నారని… దీన్ని శునకానందం అంటారని అంబటి అన్నారు. పవన్ కు ఈ శునకానందం మినహా మరో ఆప్షన్ లేదని గుర్తించాలని సూచించారు.

మరోపక్క తన “పొలిటికల్ బ్రో” కి ఆర్.ఆర్.ఆర్. తనవంతు సాయంగా ట్విట్టర్ లో రివ్యూ ఇచ్చి సహకరిస్తున్నారన్ని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!