ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు హాట్ కామెంట్స్ కొనసాగుతోన్నాయి. రఘురామను పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌గా తప్పించడంతో ఆయన స్పందించారు. తనను ఎవరూ తొలగించలేదు అని ఢిల్లీ నుంచి సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. సీఎం జగన్, వైసీపీ నేతల లక్ష్యంగా మాటల యుద్ధం కంటిన్యూ అయ్యింది. 3 నెలల క్రితమే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తనను తొలగించాలని వైసీపీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే అది ఏడాది పదవీ కాలమని.. మధ్యలో తొలగించడం కుదరదని స్పీకర్ అప్పుడే చెప్పారని తెలిపారు. ఆ పదవీ కాలం అయిపోయినందున.. తమ పార్టీకే చెందిన బాలశౌరికి ఇవ్వాలని పార్టీ లెటర్ ఇచ్చిందని తెలిపారు.
రాష్ట్రంలో రెడ్లుకు పదవులు ఇవ్వడం పూర్తయినందున.. ఒక మతానికి చెందిన వారికి ఆ పదవీ ఇచ్చారని ఆరోపించారు. అదీ తెలియని వైసీపీ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటున్నది అని ఎంపీ రఘురాజు అన్నారు. ఒకవేళ అమరావతి రాజధాని అంటూ రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తే సీఎం వైఎస్ జగన్‌పై 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను అని రఘురామ చెప్పారు. దమ్ముంటే జగన్ ఎన్నికలు వెళ్లాలని సవాల్ విసిరారు.