టోక్యో ఒలింపిక్స్: మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో బంగారు పతక వేటలో వెనుకంజ వేసిన పీవీ సింధు థర్డ్ ప్లేస్ కోసం నేడు జరిగిన మ్యాచ్లో ఘన విజయంతో కాంస్య పతకం అందుకుని భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళగా రికార్డుకెక్కింది. చైనా క్రీడాకారిణి బింగ్ జియావోతో ఆదివారం సాయంత్రం జరిగిన పోరులో వరుస సెట్స్ లో ఆధిక్యంలో నిలిచి మ్యాచ్ ని సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో చైనా క్రీడాకారిణిపై మొదటి నుండి సింధు పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. డ్రాప్ షాట్స్, క్రాస్ షాట్స్, స్మాష్‌లతో విజ్రిభించి బింగ్ జియావోకు ఏమాత్రం అవాకాశం ఇవ్వలేదు. మొదటి సెట్ లో 21-13, రెండో సెట్ లో 21-15 పాయింట్స్ తో సులువుగానే గెలుపొందింది. ఈ ఒలింపిక్స్ లో సింధు బంగారు పతకం తీసుకురావటం ఖాయమని అనుకుంటే ఊహించని విధంగా సెమీస్లో ఓటమి పాలైంది. ఆ ఓటమితో ఏమాత్రం కుంగిపోకుండా మరింత కసిగా ఆడి కాంస్య పతకం సాధించి భరత జాతి గౌరవాన్ని నిలబెట్టింది మన తెలుగు తేజం.