వాలంటీర్లపై బాధ్యతలు పెంచుతున్న సీఎం జగన్.. జీతం పెంచుతారా?

ఏపీ గ్రామ, వార్డ్ వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చేయడంతో ఎంతగానో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పని భారం పెరుగుతోందని వాలంటీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదనే సంగతి తెలిసిందే. అదే సమయంలో పని భారం పెరుగుతున్న స్థాయిలో వాలంటీర్ల వేతనం మాత్రం పెరగడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరోవైపు ఏపీ సర్కార్ ధాన్యం సేకరణ బాధ్యతను వాలంటీర్లకు అప్పగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం సేకరణ బాధ్యతలను అధికారులకు అప్పగించకుండా వాలంటీర్లకు అప్పగించడం ఏంటని కొంతమంది విమర్శలు చేస్తుండటం గమనార్హం. వాలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టపోయేది రైతులేనని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

వాలంటీర్లు అవకతవకలకు పాల్పడితే వాళ్లను శిక్షించేదెవరనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఉద్యోగులకు పని భారం తగ్గిస్తున్న జగన్ సర్కార్ వాలంటీర్లపై బాధ్యతలు పెంచడంతో పాటు వాళ్ల వేతనాలు కూడా పెంచితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. గ్రామ, వార్డ్ వాలంటీర్లలో కొంతమంది పనితీరుపై నెగిటివ్ ఒపీనియన్ ఉంది.

జగన్ సర్కార్ నిర్ణయాల వల్ల వాలంటీర్లలో కొంతమంది పని ఒత్తిడి పెరిగి ఉద్యోగాలకు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈ విషయాలను జగన్ సర్కార్ గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. జగన్ సర్కార్ రాబోయే 18 నెలల్లో అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాల్సి ఉందని ఈ విధంగా చేస్తే మాత్రమే 2024 ఎన్నికల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.