2024 ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకమే.. ఓటమిపాలైతే భవిష్యత్తు లేనట్టే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీదే భవిష్యత్తు అని మరో 15 సంవత్సరాల పాటు ఆ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సర్వేలు చెబుతున్నారు. ఏదైనా కారణం చేత రాజకీయ పార్టీ ఓటమిపాలైతే మాత్రం ఆ పార్టీకి భవిష్యత్తు లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2024 ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని వైసీపీ భావిస్తోంది.

అయితే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే ఫలితాలు ఒక విధంగా ఉంటాయని ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోని పక్షంలో ఫలితాలు మరో విధంగా ఉంటాయని వైసీపీ ఫిక్స్ అయింది. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకూడదనే ఆలోచనతోనే తరచూ వైసీపీ పవన్ టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా వైసీపీకే మేలు జరగవచ్చని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా జనసేన 30 నుంచి 40 స్థానాలలో పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఆ స్థానాలలో టీడీపీ రెబల్స్ వల్ల జనసేన నుంచి పోటీ చేసే నేతలకు ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో ఇతర పార్టీలు సైతం ఏపీలో పోటీ చేస్తుండటంతో ఓట్లు చీలడం గ్యారంటీ అని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో లేకపోతే సంక్షేమ పథకాల అమలు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు తమ ఓటు జగనన్నకే అని చెబుతున్నారు. రాయలసీమ ప్రజల మనస్సు గెలుచుకోవడంలో అటు చంద్రబాబు ఇటు పవన్ ఫెయిల్ అయ్యారు. గోదావరి జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ, జనసేన ఓటమిపాలైతే ఆ పార్టీలకు కూడా భవిష్యత్తు లేనట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.