ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పంజాబ్‌తో పోల్చారట. అరాచక పాలన ఆంధ్రప్రదేశ్‌లో సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారట. అలాగని, టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేత, ఎంపీ కనకమేడల, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.. సహచరులతో కలిసి. ఈ క్రమంలోనే నరేంద్ర మోడీకి, రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరిస్తే, ప్రధాని మోడీ గుస్సా అయ్యారట. ఔనా.? అసలు నరేంద్ర మోడీ అలా అంటారా.?
కొన్నాళ్ళ క్రితం.. అంటే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ‘పోలవరం ప్రాజెక్టు, చంద్రబాబుకి ఏటీఎం అయిపోయింది’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇప్పుడున్న జగన్ సర్కారు మీద అలాంటి ఆరోపణల్ని నరేంద్ర మోడీ నేరుగా చేస్తే అది వేరే లెక్క. అసలంటూ వైసీపీ సర్కారు మీద నరేంద్ర మోడీ ఎందుకు విమర్శలు చేస్తారు.? వైసీపీ ఎటూ, బీజేపీకి లాయల్‌గానే వుంది కదా.! ప్రత్యేక హోదా అడగట్లేదు, పోలవరంపై విమర్శలు చేయట్లేదు.. అలాంటప్పుడు, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో వున్న వైసీపీకి ఎందుకు దూరంగా జరుగుతుంది.? ఛాన్సే లేదు.!
ఈ మధ్యనే బీజేపీ నేత సత్య కుమార్ మీద, అమరావతిలో దాడి జరిగింది. ఆ దాడి వ్యవహారం మీదనే స్పందించని మోడీ, టీడీపీ నేతలు తనను కలిసి ఏదో చెబితే.. ఆ మాటలు పట్టుకుని, వైసీపీ సర్కారు మీద విమర్శలు చేస్తారా.? చెయ్యరుగాక చెయ్యరంతే.!