జగన్ ఇంటి ముందు ధర్నా… పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!

ఏపీ అధికార వైసీపీలో ఉన్న కొంతమంది కీలక నేతల్లో పేర్ని నాని ఒకరనేది తెలిసిన విషయమే. ఏ విషయంపై అయినా ఎంతోకొంత విషయ జ్ఞానంతో మాట్లాడతారని ఆయనకు పేరు. ఇక జనసేన విషయాంలో అయితే… పవన్ స్పీచ్ అవ్వగానే పేర్ని ప్రెస్ మీట్ కోసం చూసేవాళ్లు లక్షల్లో ఉంటారన్నా అతిశయోక్తి కాదు!

ఇదే సమయంలో ఎంత క్లిష్టమైన సమస్య వచ్చినా… కూల్ గానే స్పందించడంతోపాటు.. వీలైనంత కూల్ గానే పరిష్కారం కూడా కనుగొంటారని అంటుంటారు. అలాంటి మిస్టర్ కూల్ కి ఉన్నఫలంగా ఆగ్రహం వచ్చిందట. ఒక్కసారిగా సీరియస్ అయిపోయారంట. దీంతో మీటింగ్ కి హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే… ఉమ్మడి కృష్ణాజిల్లా జడ్పీ సమావేశం జరుగుతోందట. ఈ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ కానీ, ఇతర అధికారులు కానీ హాజరు కాలేదట. దీంతో పేర్నినానికి ఎక్కడ లేని కోపమొచ్చిందని తెలుస్తుంది. అధికారులు జడ్పీ సమావేశానికి హాజరుకాకపోవడంతో ముఖ్యమైన అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు భావించిన పేర్ని కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.

ఇలా జడ్పీ సమావేశాలకు జిల్లా అధికారులు కానీ, ఆ జిల్లా కలెక్టర్ గాని హాజరు కాకపోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఈ సమయంలోనే వచ్చే సమావేశాలకు వారు రాకపోతే జడ్పీటీసీలతో కలిసి సీఎం ఇంటి ముందు లేకపోతే, సీఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామని ఆయనకు లేఖ రాయాలని.. చైర్ పర్సన్ ఉప్పాల హారికకు సూచించారని తెలుస్తుంది.

ఈస్థాయిలో పేర్ని నాని ఫైరయ్యారంటే… అందులో కచ్చితంగా విషయం ఉండి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. అధికారులు సహకరించకపోతే.. నాయకుల ఇబ్బందులు ఏస్థాయిలో ఉంటాయో తెలిసిన వ్యక్తిగా పేర్ని నాని ఆగ్రహంలో న్యాయం ఉందని అంటున్నారు. మరి వచ్చే సమావేశాలకు అయినా కలెక్టర్, అధికారులు హాజరవుతారా.. లేక, పేర్ని నానితో జగన్ ఇంటి ముందు ధర్నా చేయిస్తారా అనేది వేచి చూడాలి.