“మా తాత ఇంత ముదురా”… బ్రాహ్మణిపై పేర్ని పంచులు!

ఏపీ అసెంబ్లీ రెండో రోజు పూర్తిగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్కాం ఎలా మొదలైంది.. ఎలా ముగిసింది.. ఎలా వెలుగు లోకి వచ్చింది.. అనే అంశాలపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని మైకందుకున్నారు!

ఏపీ అసెంబ్లీ రెండో రోజు ఉదయం టీడీపీ సభ్యుల

రసాభాస నడుమ కాసేపు వాయిదా పడింది. అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన పేర్ని నాని… 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన అనంతరం ఆగస్టు నెలలో సీమన్స్ ఇండియాకు సంబంధించిన ప్రతినిధి ఒకరు, డిజైన్ టెక్ కి సంబంధించిన ప్రతినిధి ఒకరు కలిశారని మొదలుపెట్టారు.

వారు అలా వచ్చి చంద్రబాబును కలిసి, ఈ స్కిల్ గురించి చెప్పిన 19 రోజులకు ఏపీ రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ని స్టార్ట్ చేయడం జరిగిందని నాని అన్నారు. అనంతరం స్కాం జరిగిన విధానాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా… చంద్రబాబు రిమాండ్ పై నారా బ్రాహ్మణి చేసిన కామెంట్స్ పై పేర్ని నాని ప్రధానంగా స్పందించారు. దేవాన్ష్ కి అర్ధమవ్వాలంటే ఎలా చెప్పాలో వివరించారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్ బయట చంద్రబాబు బంధువు ఒకరు… “తన ఎనిమిదేళ్ల కుమారుడికి ఈ రిమాండ్ నోటీసు చూస్తే ఇందులో ఏమీ లేదని అంటాడని.. అది ఎవరికైనా అర్ధమవుతుందని” అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించిన పేర్ని నాని… ఆ ఎనిమిదేళ్ల అబ్బాయికి ఈ తారీఖులు చూపిస్తూ “నాన్నా… మీ తాతగారు ఇలా చేశారు” అని చెబితే అతడికి కూడా క్లియర్ గా అర్ధమవుతుందని అన్నారు.

తాను చెప్పబోయే విషయాలు విన్న తర్వాత… “మా తాత ఎంత ఆత్రపడ్డాడు.. 22వ తారీఖున డిజైన్ టెక్ కంపెనీవారు రావడం ఏమిటి.. దానికోసం వెంటనే కొత్త డిపార్ట్ మెంట్ ఒకటి పెట్టడం ఏమిటి.. మా చుట్టం గంటా సుబ్బారావుని తేవడం ఏమిటి.. మా పార్టీలో లెక్కలు చూసేవాడిని తెచ్చి డిపార్ట్మెంట్ లో పెట్టడం ఏమిటి..” వంటి విషయాలన్నీ చెబితే క్లియర్ గా అర్ధమవుతుందని పేర్ని నాని తనదైన శైలిలో చెప్పారు.

ఈ వివరాలన్నీ చూస్తే ఆ ఎనిమిదేళ్ల పిల్లాడికి కూడా… “మా తాత ఇంత ముదురా” అని అంటారని.. “మా తాత ఇంత స్కిల్డా” అని ఆశ్చర్యపోతారని.. కాకపొతే వివరంగా చెప్పాలని వివరించారు పేర్ని నాని!