టీడీపీ వైసీపీ జనసేన.. ఏపీలో ఏ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముచ్చటగా మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. రాష్ట్రంలో మరిన్ని రాజకీయ పార్టీలు ఉన్నా ఆ పార్టీలు పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ పార్టీలను నమ్మాలని కూడా ప్రజలు భావించే పరిస్థితులు లేవు. మరోవైపు ఇప్పటికే ఉన్న పార్టీలపై కూడా ప్రజల్లో సదభిప్రాయం లేకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

 

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ భవిష్యత్తుకు సంబంధించి అద్భుతాలు జరుగుతాయని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. టీడీపీ వైసీపీ పాలనను ఇప్పటికే ప్రజలు చూసేశారు. జనసేన రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ప్రజలు భావించడం లేదు. 2024లో ప్రజల ఆప్షన్ టీడీపీ వైసీపీలలో ఏదో ఒక పార్టీ అయ్యి అవకాశం ఉంది. వైసీపీకి ఎక్కువగా విజయావకాశాలు ఉండగా టీడీపీకి మాత్రం తక్కువగా విజయావకాశాలు ఉన్నాయి.

 

టీడీపీకి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలలో ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండగా మిగతా జిల్లాలలో మాత్రం వైసీపీకి పరిస్థితులు అనుకూలంగా ఉండటం గమనార్హం. జనసేన గోదావరి జిల్లాలలో మాత్రమే సత్తా చాటే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టీడీపీకి భారీ షాకులిచ్చే దిశగా అభ్యర్థుల ఎంపికలో జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

ఏపీసీఎం వైఎస్ జగన్ 175 కు స్థానాలకు 175 స్థానాలలో విజయం సాధించాలని భావిస్తునట్టు తెలుస్తోంది. వైసీపీ వీక్ గా ఉన్న నియోజకవర్గాలపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. సీఎం జగన్ ప్లానింగ్ అదుర్స్ అనేలా ఉండనుందని సమాచారం అందుతోంది.