యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర.. పవన్ విమర్శలు హద్దులు దాటుతున్నాయా?

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసినా ఒక స్థానంలో కూడా విజయం సాధించలేక ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇతర పార్టీలపై విమర్శలు చేసే విషయంలో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందువరసలో ఉంటారు. ప్రధానంగా పవన్ టార్గెట్ చేసే పార్టీ ఏదనే ప్రశ్నకు వైసీపీ పేరు సమాధానంగా వినిపిస్తుందనే సంగతి తెలిసిందే.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ 25 జిల్లాలను 25 రాష్ట్రాలు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్ మూడు రాజధానుల నిర్ణయం గురించి తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. వికేంద్రీకరణ వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తే ఏపీకి మూడు రాజధానులు మాత్రమే ఎందుకు అని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

జగన్ ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్రకటించాలని పవన్ కళ్యాణ్ కోరారు. 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా జగన్ ప్రకటించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో 25 రాజధానులను చేయాలని ఏపీని వైసీపీ రాజ్యంగా మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈ విషయంలో వైసీపీ ఏ మాత్రం సంకోచించవద్దని పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. వైసీపీ నేతలు తనపై ట్రోల్స్ చేస్తూ ఉండటంతో పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఘాటుగా విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది.

జనసేన ప్రజల కోసం ఏం చేసిందని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. కౌలు రైతులకు అరకొర సాయం చేయడం మినహా జనసేన ప్రజల కోసం ఏమైనా చేసిందా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ కామెంట్ల గురించి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రతి విషయానికి కోపంగా స్పందించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలి.