AP: వాలంటీర్ల ఆశలు అడియాశలేనా…. తమ నిర్ణయం ఏంటో తేల్చేసిన ప్రభుత్వం!

AP: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వాలంటీర్ ద్వారా ఇంటి వద్దకి తీసుకువెళ్లారు. ఇలా వాలంటీర్ విధులు నిర్వహించినందుకు గాను వారికి గౌరవ వేతనంగా 5000 రూపాయలు అందించేవారు అయితే మొదట్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థను పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు.

వాలంటీర్ వ్యవస్థ గురించి ఎంతో అవమానకరంగా మాట్లాడారు. అయితే ఎన్నికల సమయానికి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రస్తుతం 5000 ఇస్తున్నటువంటి వీరికి పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తాము అంటూ మాయ మాటలు చెప్పారు. దీంతో ఎంతో మంది వాలంటీర్లు కూడా కూటమి పార్టీలవైపే ముగ్గు చూపుతూ వారికి ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారు. ఇక కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 9 నెలలు పూర్తి అవుతుంది కానీ ఇప్పటివరకు మాత్రం వాలంటీర్ల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇక వాలంటీర్లను కొనసాగించాలి అంటే కుదరదని గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల వారిని కొనసాగించలేకపోతున్నామని తెలిపారు. అయితే తిరిగి తమని విధుల్లోకి తీసుకోవాలి అంటూ వాలంటీర్లు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మరోసారి స్పష్టం చేశారు. వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాలంటీర్లు ఎవ్వరు లేరని.. రెన్యూవల్ చేయలేదని కుండబద్దలు కొట్టేశారు.వాలంటీర్లను 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవి పొడిగింపుకు జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెగ్యులరైజ్ చేసేవాళ్లమని వివరించారు. దీంతో ఇకపై కూటమి ప్రభుత్వం వాలంటీర్లను తిరిగి తీసుకునే ఆలోచనలో లేదని స్పష్టమవుతుంది.