Shilpa Ravi: పవన్ పై శిల్పా రవి సంచలన పోస్ట్… ఆడుకుంటున్న జనసైనికులు… కాశిరెడ్డి మీ కులమేనా?

Shilpa Ravi: శిల్ప రవి పరిచయం అవసరం లేని పేరు నంద్యాల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు. అయితే ఈయనకు మద్దతు తెలపడం కోసమే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడంతో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలలో ఓటమిపాలైన తర్వాత శిల్పా రవి ఇప్పటివరకు ఎక్కడ ఏ విధంగానో స్పందించలేదు. ముఖ్యంగా తన స్నేహితుడు అరెస్ట్ అయినప్పటికీ కూడా ఈయన స్పందించిన దాఖలాలు లేవు.

ఇదిలా ఉండగా తాజాగా శిల్పా రవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.కడప జిల్లా నల్లమల అటవీప్రాంతంలోని కాశినాయన ఆశ్రమం జ్యోతిక్షేత్రం ఎంతో ప్రజాదరణ పొందింది. ఇందులోని అన్నదాన సత్రంలో ప్రతీరోజూ వందలమంది పేదలు, బాటసారులు, యాత్రికులు ఆకలి తీర్చుకునే వారు. ఇలాంటి అన్నదానం సత్రాన్ని అటవీశాఖ అధికారులు కూల్చివేశారు.

ఈ విధంగా అటవీశాఖ అధికారులు ఈ సత్రాన్ని కూల్చివేయడంతో ఇప్పటికి పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. అయితే ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.సనాతన ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన నాయకులు కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేతపై స్పందించరా?’ అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు అయితే ఈయన పోస్ట్ పై జనసైనికులు స్పందిస్తూ అల్లు అర్జున్ ఇష్యుని కూడా బయటకు తీసుకువస్తున్నారు.

నీ మిత్రుడు జైల్లో ఉంటే స్పందించవా..? సొంత మేనమామకి అల్లుడికి గొడవ పెట్టి..! ఏం సాదించవ్.. మళ్లీ నంద్యాలలో గెలిచే సత్తా ఉందా..!.. మీ కన్వర్టెడ్ రెడ్డి టైంలో గుడులు, కన్వర్షన్ ఎక్కువ అయ్యాయి. ఏం చేసావ్..! కాశి రెడ్డి మీ కులం అని మాట్లాడుతున్నావా..? అంటూ జనసైనికులు పెద్ద ఎత్తున శిల్పా రవికి కౌంటర్లు ఇస్తూ చేసిన ఈ పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.