ఆ సొమ్ముల్ని ఎన్నికల కోసం వుంచుకోవచ్చుగా పవన్ కళ్యాణ్.!

నెటిజన్లు ఉచిత సలహా ఇస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి. ఆ నెటిజన్లలోనూ జనసేన మద్దతుదారులే ఎక్కువగా కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అస్సలేమాత్రం డబ్బు ఖర్చు చేయలేదని జనసేన పార్టీ చెబుతోంది. కానీ, కొన్ని చోట్ల బాగానే ఓట్లను జనసేన కొనేందుకు ప్రయత్నించిందన్న విమర్శలు లేకపోలేదు. సరే, ఈ రోజుల్లో రాజకీయాలు డబ్బుతో ముడిపడి వున్నాయన్నది బహిరంగ రహస్యం. ఇటీవల మునుగోడులో ఉప ఎన్నిక జరిగితే, లెక్కా పత్రం లేకుండా పెద్దమొత్తంలో ఖర్చు చేశాయి ప్రధాన రాజకీయ పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ. ఒక్కో ఓటుకీ తమకు దాదాపు పది వేలు వచ్చిందని ఓటర్లే చెప్పారు.. అదీ రెండు పార్టీల నుంచి వచ్చిన సొమ్ములట.

ఈ లెక్కన వచ్చే ఎన్నికలు మరింత ఖరీదు కాబోతున్నాయి. ఈ ఓట్లను కొనే విషయమై రేటు దాదాపు అన్ని చోట్లా ఒకేలా వుంటుంది. నోటు ఇవ్వకపోతే ఓట్లెయ్యని ఓటర్లూ వున్నారు. ధన రూపంలోనో, వస్తు రూపంలోనో ఓటర్లకు చదివించుకోవాల్సిందే. కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ రూటే సెపరేటు. జనాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు.. రకరకాల యాత్రలు చేపడుతూ, ఖర్చు చేస్తున్నారు. ఇదంతా వృధా ఖర్చు.. అన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. తాజాగా ఇప్పటం గ్రామస్తుల్లో ఇళ్ళు ధ్వంసమైనవారికి లక్ష రూపాయల చొప్పున సాయం ప్రకటించారు జనసేనాని.జనసేన లెక్క ప్రకారం 53 ఇళ్ళను ప్రభుత్వం ధ్వంసం చేసిందని అనుకోవాలి. అంటే, 53 లక్షలు ఇవ్వబోతున్నారనన్నమాట. ఇలాంటి మొత్తాల్ని ఎన్నికల సమయంలో వాడుకోవచ్చు కదా.? అన్నది చాలామంది సూచన.