బీజేపీ జనసేన పొత్తు ఉందా లేదా.. అభిమానులకు క్లారిటీ ఇవ్వొచ్చుగా పవన్?

కొన్నిరోజుల క్రితం మోదీ పవన్ కళ్యాణ్ సమావేశం కాగా ఆ సమావేశంలో మాట్లాడుకున్న విషయాలు ఏంటనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. మోదీ పర్యటన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ బీజేపీకి దూరంగా ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కారణాలు తెలియదు కానీ టీడీపీ జనసేన పార్టీల మధ్య కూడా గ్యాప్ పెరిగిందనే సంగతి తెలిసిందే. అయితే బీజేపీ జనసేన పొత్తు ఉందా లేదా అనే ప్రశ్న వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉందో లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. బీజేపీ సైతం పలు సందర్భాల్లో పవన్ ను అవమానించిందని కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పవన్ ప్రతి విషయంలో ఇకపై స్పష్టతతో ముందుకెళ్లాలని మరి కొందరు చెబుతారు. అలా చేస్తే మాత్రం పవన్ కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

పాదయాత్ర ద్వారా కాకపోయినా మరో విధంగా ప్రజలకు దగ్గరయ్యే దిశగా పవన్ అడుగులు వేయాల్సి ఉంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా పాపులారిటీ మరింత పెరిగేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. విమర్శల విషయంలో పవన్ నోరు జారకుండా హుందాగా స్పందిస్తే మంచిదని మరి కొందరు చెబుతున్నారు. సినిమాసినిమాకు పవన్ మార్కెట్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

పవన్ తన పాపులారిటీని కరెక్ట్ గా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తుండగా రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాల్సి ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.