హర్ట్ అవుతున్న పవన్ రెండో వర్గం ఫ్యాన్స్… న్యాయముంది!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఏపీలో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉండగా… గోదావరి జిలాల్లో అయితే పీక్స్ లో ఉంటుంది. అయితే పవన్ కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా.. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఉన్నారు. గతంలో ఒంటరిగా పోటీచేసి దెబ్బతినడంతో.. మరోసారి వీరమరణానికి ఛాన్స్ ఇవ్వకుండా టీడీపీతో పొత్తుతో పోటీచేయబోతున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… రెండో వర్గం ఫ్యాన్స్ కు పవన్ ఒక బ్యాడ్ న్యుస్ చెప్పారని తెలుస్తుంది!

పవన్ కల్యాణ్ కు ఇప్పుడు రెండు రకాల ఫ్యాన్స్ ఉన్నారు! వీరిలో పవన్ సినిమాలతో పాటు.. ఆయన రాజకీయాలు చేసినా, ఇంకా ఏమి చేసినా సమర్ధించేవర్గం. ఇక రెండో వర్గం కూడా ఉంది. వీరు కూడా పవన్ కి హార్డ్ కోర్ ఫ్యాన్సే. వీరిలో కూడా మెజారిటీ ప్రజలు ఆయన సామాజికవర్గానికి చెందినవారూ ఉన్నారు! అయితే వీరు ఓటు మాత్రం జగన్ కి వేస్తారు.. సినిమాలు మాత్రం పవన్ వి చూస్తారు.

అంటే… వీరు పవన్ ని పిచ్చిగా ప్రేమిస్తారు.. హీరోగా ఆరాధిస్తారు.. అభిమానిస్తారు.. సినిమా విడుదల సమయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు.. కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తారు. పవన్ తెరపై కనిపిస్తే కాగితాలు చల్లుతారు.. ఈలలు వేస్తారు. కానీ ఓటు మాత్రం జగన్ కు వేస్తారు! ప్రస్తుతం ఈ వర్గం ఫ్యాన్స్ తెగ హర్ట్ అవుతున్నారంట. కారణం… సినిమాలు పక్కన పెట్టి వారాహీ యాత్ర అంటూ బయలుదేరడం.

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ తేదీ జూన్ 14న నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. అన్నవరం నుండి భీమవరం వరకు తొలి విడత యాత్ర ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా పవన్ కల్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. వారాహి యాత్ర నేపథ్యంలో, మరోపక్క ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో… సినిమా షూటింగ్‌ లకు తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నారంట పవన్.

దీంతో ఈ విషయం తెలిసి, పవన్ సినిమాల కోసం ఎదురు చూస్తోన్న అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారంట. కాగా… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాల షూటింగ్స్‌ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రో, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవి ఎప్పుడెప్పుడు థియేటర్స్‌ లో విడుదలవుతాయా అని ఈ వర్గం ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈలోపు పవన్ ఇలా యాత్ర అంటూ బయలుదేరడంతో… తమను హర్ట్ చేశారని వాపోతున్నారంట ఈ వర్గం ఫ్యాన్స్!