పవన్ కళ్యాణ్ కౌంటర్ ఎటాక్.! డిఫెన్స్‌లో పడ్డ అధికార పక్షం.!

Pawan Kalyan : రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటైతే, కొత్త జిల్లాల పేర్ల విషయమై ఆయా జిల్లాల్లో వివాదాలు వచ్చినా, 12 జిల్లాల్లో పేరు మార్చుతూ నిర్ణయం తీసుకోని ప్రభుత్వం, కేవలం కోనసీమ జిల్లా విషయంలోనే ఎందుకు పేరు మార్పు నిర్ణయం తీసుకుంది.? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

‘ప్రభుత్వం కావాలనే ఈ జాప్యం చేసింది. ఆ పెట్టే పేరు ఏదో మొదటే పెట్టేస్తే, అప్పుడు వివాదం వచ్చేదో.. రాకుండా వుండేదో.! కావాలనే ప్రభుత్వం ఇదంతా చేసింది. ప్రభుత్వంలో వున్నవారు పక్కాగా ఈ పరిస్థితులకు స్కెచ్ వేసి, విజయం సాధించారు.. ప్రజలే ఇబ్బందులు పడుతున్నారిప్పుడు..’

అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అయితే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు.

చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టుని పవన్ కళ్యాణ్ చదువుతున్నారంటూ మంత్రి రోజా ఆరోపించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు