ప్యాకేజీ విమర్శలపై పవన్ కు లిట్మస్ టెస్ట్… బీజేపీ బంపరాఫర్?

పవన్ రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకో చెప్పే మాటలు, చేసే ప్రసంగాలు అన్నీ హంబక్కు అని.. అవన్నీ పోసికోలు కబుర్లని.. ప్రజలను ఏమార్చడానికి పైకి చేసే ప్రయత్నాలని.. వాస్తవానికి పవన్ కు అలాంటి ఆలోచన లేదని.. కేవలం చంద్రబాబు కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని.. బాబు ఆడమన్నట్లు ఆడతాడని చెబుతుంటారు వైసీపీ నేతలు. ఫలితంగా… ప్యాకేజీ స్టార్ అనే పేరు తగిలించారు.

ఈ సమయంలో తనపై వస్తోన్న ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు వంటి కామెంట్లపై పవన్ అప్పుడప్పుడూ కాస్త ఆవేశంగా రియాక్ట్ అవుతుంటారు కానీ.. చేసే పనులు మాత్రం ఆ విమర్శలకు బలం చేకూర్చేలానే ఉంటున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతుంటారు. పవన్ ప్రవర్తనలో ఆ మార్పు రానంతవరకూ.. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ వంటి విమర్శలు తప్పవని చెబుతుంటారు.

ఈ నేపథ్యంలో… ఆ విమర్శ నుంచి బయటపడటానికి, ఆ ప్యాకేజీ స్టార్ – దత్తపుత్రుడు వంటి పేర్లు పోగొట్టుకోవడానికి పవన్ కు బీజేపీ ఒక సువర్ణావకాశం ఇవ్వబోతోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా… రాబోయే ఎన్నికల్లో బీజేపీ – జనసేన పొత్తులో పోటీ చేయాలని, ఆ సమయంలో సీఎం అభ్యర్థిగా పవన్ ను ముందుపెడతామని అంటున్నారని తెలుస్తుంది.

అవును… ఏపీలో టీడీపీని తొక్కి, వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ నేతలు ఎప్పటినుంచో ఆలోచిస్తున్నారని అంటుంటారు. అయితే ఈ విషయంలో బీజేపీలో ఉన్న చంద్రబాబు బ్యాచ్.. ఆ లక్ష్యం నెరవేరకుండా పావులు కదుపేవారని అంటుంటారు. దీంతో.. ఇకపై వారి ఆటలు సాగనివ్వకూడదని బీజేపీ అధిష్టాణం పెద్దలు ఆలోచిస్తున్నారని సమాచారం.

ఇందులో భాగంగా… ఏపీ బీజేపీకి కమ్మ సామాజికవర్గానికి చెందిన, చంద్రబాబు తో ఏమాత్రం సానుకూలత నటించని పురందేశ్వరికి అధ్యక్ష భాధ్యతలు ఇచ్చరని, ఇదే సమయంలో కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికచేయబోతున్నారని తెలుస్తుంది. ఇదే జరిగితే ఏపీలో కాపు ఓట్లను వీలైనంత ఎక్కువగా దక్కించుకోవడంతోపాటు.. కమ్మ సామాజికవర్గంలో కూడా పాగా వేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు.

అయితే ఈ సమయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు. బీజేపీ ఇస్తున్న ఈ ఆఫర్ కు పవన్ అంగీకరించి… బీజేపీతో కలిసి ఏపీలో పోటీ చేస్తే కచ్చితంగా… జగన్ కు ప్రత్యమ్నాయంగా పవన్ మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలా కాకుండా… చంద్రబాబుతోనే తన ప్రయాణం అంటే మాత్రం… కచ్చితంగా వైసీపీ నేతలు తగిలించిన పేర్లు సార్ధకం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారంట.

మరి బీజేపీ ఇవ్వబోతోందని చెబుతున్న ఈ ఆఫర్ కు పవన్ అంగీకరిస్తారా.. లేక, బాబు లేని రాజకీయం తనకు వద్దని లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి!