ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్… పవన్ కల్యాణ్ కు లీగల్ నోటీసులు?

తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా వైసీపీ నాయకులు, వారి అనుకూల వ్యక్తులు, సంస్థలు విమర్శలు చేస్తున్నారంటూ జనసేన బలంగా ఆరోపిస్తుంది. ఇందులో భాగంగా లీగల్ నోటీసుల జారీకి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సదరు సంస్థాలకు, వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో… విమర్శలు అనే అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

అవును.. తన వైవాహిక జీవితంపై తప్పుడు ఆరోపణలు, కథనాలు రాస్తు, తప్పుడు పోస్టులు పెడుతున్నారంటు కొందరిపై లీగల్ యాక్షన్‌ కు సిద్ధమయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాన్. పవన్ తన మూడో భార్య అనా లెజినోవాకు విడాకులు ఇస్తున్నారని కొన్ని వెబ్‌ సైట్ల‌లోను, లెజినోవాయే పవన్‌ కు విడాకుల నోటీసులు పంపిందని మరికొన్ని వెబ్ సైట్లలోనూ వార్తలు, కథనాలు వచ్చాయి. దీంతో… వాళ్ళందరికీ జనసేన లీగల్ సెల్ తరపున లీగల్ నోటీసులు పంపుతున్నారు!

అయితే ఇక్కడ మరో రకం చర్చ తెరపైకి వస్తుంది. పవన్ తన మూడో భార్య గురించో, విడాకుల గురించో మాత్రమే ఈ నోటీసులు పంపించడం లేదు దీని వెనక మరో బలమైన రాజకీయ కారణం కూడా ఉందనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా తన రాజకీయ నిర్ణయాలను, ప్రసంగాలను, అడుగులను, ఆలోచనలను నిత్యం తప్పుపట్టే సంస్థలపై ఈ వంకన కసి తీర్చుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు!!

లీగల్ నోటీసుల వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనిస్తే… వారాహి యాత్ర మొదలైన తర్వాత పవన్ టూర్‌ పై కొన్ని వెబ్‌ సైట్లు, యూట్యూచ్ చానళ్ళల్లో బాగా నెగిటివ్ వార్తలు, కథనాలు వచ్చాయని జనసైనికులు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. దీంతో… లీగల్ నోటీసులు ఇచ్చి ఎంతో కొంత రివేంజ్ తీర్చుకోవచ్చని పవన్ ఆలోచించి… ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ఆ సంగతి అలా ఉంటే… మరోపక్క జగన్ పై పవన్ చేసిన విమర్శలను తెరపైకి తెచ్చి.. జనసేనానికి నోటీసులు పంపే ఆలోచనలో కొంతమంది వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. అవును… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పవన్ కల్యాన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. సీఎం కుటుంబ విషయాలను తెరపైకి తెస్తూ… వ్యక్తిత్వ హననానికి పాల్పడిన సంగతులను గుర్తుచేస్తున్నారు.

వీటిలో ప్రధానంగా… జగన్ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని.. జగన్ క్రిమినల్ సీఎం అని.. తల్లి, చెల్లిని రాష్ట్రం నుండి తరిమేశాడని ఎన్నోసార్లు మైకుల ముందు విమర్శించిన సంగతి తెలిసిందే. క్రిమినల్ అని, జైలు పక్షి అని, వదిలే ప్రసక్తి లేదని బెదిరించిన సంఘటనలు లేకపోలేదు. దీంతో… తనవరకూ వస్తే కాని పవన్ తత్వం భోదపడలేదా అని ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులు… ఆ మేరకు సాక్ష్యాలన్నీ పోగుచేసి… పవన్ కు లీగల్ నోటీసులు పంపే ఛాన్స్ ఉందని తెలుస్తుంది!

మరి శృతిమించిన విమర్శల ఫలితంగా తెరపైకి వచ్చిన ఈ లీగల్ నోటీసుల వ్యవహారాలు… ఎలాంటి పరిణామాలకు కారణాలవుతాయో.. ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సరికొత్త విషయాలను తెరపైకి తెస్తుందో వేచి చూడాలి.