బలిజలే బలంగా… పవన్ నియోజకవర్గం ఫిక్స్!

గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం లలో పోటీచేసిన జనసేనఅధినేత పవన్ కల్యాణ్ కురెండు చోట్లా పరాభవమే ఎదురైన పరిస్థితి. గడిచిన ఎన్నికల్లో ఫ్యాన్ గాలి గ్యాప్ లేకుండాబలంగా వీచడంతో.. పవన్ కు గెలుపుతలుపు తీయలేదు. అయితే… ఈసారి కోస్తా ప్రాంతాన్ని కాకుండా.. సీమ ప్రాంతాన్ని నమ్ముకోవాలిఫిక్సయ్యారంట పవన్.

అవును…ఈసారి రాయలసీమ ప్రాంతంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనిఫిక్సయ్యారంట పవన్ కల్యాణ్. అందులోభాగంగా తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తారని టాక్ నడుస్తోంది. తిరుపతిలోబలిజ సామజికవర్గం బలంగా ఉంటుంది. దాంతో గడిచిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచిగెలిచిన అభ్యర్థులు.. పార్టీల కతీతంగా కాపులే! దీంతో… ఇంతకుమించిన సేఫ్ ప్లేస్ ఉండదనిపవన్ భావిస్తున్నారంట.

గడిచినఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. 1994లో టీడీపీ నుంచిఎ.మోహన్, 1999లో చదలవాడ కృష్ణమూర్తి, 2004-2014ల్లో వెంకట రమణ, 2009లో మెగాస్టార్ చిరంజీవి…ఇలా వరుసగా ఇక్కడ కాపులదే విజయం. ఈ నేపథ్యంలో వచ్చేఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీచేస్తే గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి.. జగన్ ప్రభంజనంలో కూడాకేవలం 700 ఓట్ల తేడాతోనే బయటపడినపరిస్థితి.

మరోవైపు టీడీపీ–జనసేనపొత్తు ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో పవన్ తిరుపతి నుంచి బరిలోకి దిగడం ఖాయమని అంటున్నారు. పైగా… తిరుపతిలో పాదయాత్ర చేసిన నారా లోకేష్ ఆ నియోజకవర్గానికి మాత్రం టీడీపీ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో… ఈ విషయానికి మరింత బలం చేకూరుతుంది. దీంతో… రాబోయే ఎన్నికల్లో తిరుపతి నుంచి టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ పోటీచేస్తారని ఫిక్సయిపోవచ్చని అంటున్నారు! అయితే.. ఈసారి తిరుపతి నుంచి వైకాపా అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, ప్రస్తుతం తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డిని బరిలోకి దించుతారని టాక్ నడుస్తోంది.