మోదీ హెచ్చరికలతో పవన్ కళ్యాణ్ సైలెంట్.. ఆశలు అడియాశలయ్యాయా?

దాదాపుగా ఎనిమిది సంవత్సరాల తర్వాత మోదీని కలిసిన పవన్ కళ్యాణ్ కు మోదీతో భేటీ వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ను పరోక్షంగా హెచ్చరించారని జనసేన వర్గాల నుంచి సమాచారం అందుతోంది. టీడీపీతో జనసేన దోస్తీ విషయంలో మోదీ సీరియస్ అయ్యారని సమాచారం. వైసీపీ గురించి వరుసగా పవన్ చేసిన ఫిర్యాదులపై కూడా మోదీ అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది.

మోదీతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ముఖం చూసిన వాళ్లంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగా అర్థమవుతుంది. 2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని పవన్ భావిస్తుండగా అందుకు భిన్నంగా జరుగుతుండటంతో ఆయన ఫీలవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ సొంతంపై చేస్తున్న కొన్ని కామెంట్లపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మోదీతో భేటీ ద్వారా ఏదో సాధించాలని అనుకున్న పవన్ కళ్యాణ్ అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురు కావడంతో ఫీలయ్యారని బోగట్టా. మోదీతో భేటీ తర్వాత మోదీని ఎందుకు కలిశానా అని పవన్ కళ్యాణ్ ఫీలయ్యారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. తాను ఏం చెప్పినా మోదీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని పవన్ కళ్యాణ్ ఫీలయ్యారని బోగట్టా.

బీజేపీతో పొత్తు విషయమై పవన్ కళ్యాణ్ అతి త్వరలో తేల్చుకోనున్నారని తెలుస్తోంది. బీజేపీతో పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి ఎదుర్కొంటున్నారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. జనసేనతో పొత్తు ఉన్నా లేకపోయినా ఒకటేనని బీజేపీ భావిస్తోందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.