తీరాన్ని తాకిన పెథాయ్ తుఫాన్.. గజగజ ఒణుకుతున్న కోస్తాంధ్ర (వీడియోలు)

పెథాయ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ని ఒణికిస్తోంది. పెథాయ్ తీవ్ర తుఫాన్ గా మారి శరవేగంగా దూసుకోస్తుంది. కాట్రేని కోన వద్ద తుఫాన్ తీరాన్ని తాకింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ తో పలు కోస్తా, ఆంధ్రా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కూడా వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పెథాయ్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాన్‌ ధాటికి పలు జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. సముద్రంలో అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. పెథాయ్‌ నేపథ్యంలో అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

తుఫాన్ తీరాన్ని తాకడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు, తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. అవసరమైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచారు.  తుఫాన్ ఎఫెక్ట్ వీడియోలు

కింద ఉన్నాయి చూడండి.