2019 ఎన్నికలకు ముందు ఏపీలోని ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు ప్రజల్లోకి వచ్చి చేసిన హంగామా అంతాఇంతా కాదు. జగన్ అధికారంలోకి రాకముందు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడంతో పాటు ప్రజలకు ప్రయోజనం కలిగేలా ఎన్నో పథకాలను ప్రకటించి 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించటానికి కారణమయ్యారు.
అయితే 2024 ఎన్నికలకు కొంత సమయమే ఉన్నప్పటికీ ఏపీ రాజకీయ నేతలు ప్రజల్లోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. వయస్సు రిత్యా చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు. ఈ రీజన్ వల్లే పవన్ ప్రజల్లోకి ఎక్కువగా రావడం లేదు.
లోకేశ్ కు ప్రజల్లోకి రావాలనే ఆసక్తి ఉన్నా లోకేశ్ ప్రజల్లోకి రావడం వల్ల పార్టీకి కలిగే లాభం కంటే నష్టం ఎక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రజల్లోకి రాని రాజకీయ నేతలు సోషల్ మీడియా ద్వారా మాత్రం పోరాటాన్ని కొనసాగిస్తూ ఉండటం గమనార్హం అయితే ఏపీ ప్రజల్లోని 80 శాతం మందికి సోషల్ మీడియా గురించి పెద్దగా అవగాహన లేదు. సోషల్ మీడియా పబ్లిసిటీ సినిమాకు మేలు చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.
సోషల్ మీడియా పోరాటాల వల్ల ఆయా రాజకీయ నేతలకు ప్లస్ కంటే మైనస్ ఎక్కువగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సోషల్ మీడియా పోస్ట్ లకు పాజిటివ్ కామెంట్లు ఏ స్థాయిలో ఉంటాయో కొన్ని సందర్భాల్లో నెగిటివ్ కామెంట్లు కూడా అదే స్థాయిలో వస్తాయనే సంగతి తెలిసిందే. పవన్, చంద్రబాబు, జగన్ లలో 2024 ఎన్నికల్లో సీఎం అయ్యే వ్యక్తి ఎవరో చూడాల్సి ఉంది.