సీనియర్ ఎన్టీఆర్ నుంచి టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి ఏ విధంగా వెళ్లిందో అందరికీ తెలుసు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉండి ఉంటే సీనియర్ ఎన్టీఆర్ మరికొన్ని సంవత్సరాల పాటు ఏపీని పాలించే వారు అని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నానని చంద్రబాబు చెబుతున్నా వాస్తవాలు ప్రజలకు తెలుసు. టీడీపీ హయాంలో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో కూడా ఏపీ ప్రజలకు పూర్తిస్థాయిలో తెలుసు.
2014 ఎన్నికల సమయంలో అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఎంతగానో మేలు జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే నారా చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కు తెగ ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు బాలయ్యకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకుండా చంద్రబాబు వ్యవహరించడం మంచిది కాదని విశ్లేషకుల నుంచి సైతం అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ బాధ్యతలు ఇస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు నుంచి ఈ ప్రతిపాదన వస్తే అంగీకరించడానికి తారక్ సైతం సిద్ధంగా ఉన్నారు.
రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు అంగీకరించినా అంగీకరించకపోయినా పార్టీలో కీలక మార్పులు రావాల్సి ఉంది. అలా జరగని పక్షంలో టీడీపీ భారీ స్థాయిలో నష్టపోవడం గ్యారంటీ అని కామెంట్లు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం 2024 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించకపోవచ్చని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.