ప్రజాస్వామ్యం .. ఈ ప్రజాస్వామ్యం లో ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు. అందరికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. నీకు నచ్చదు అని వారిని అలా మాట్లాడకు అని చెప్పడం కుదరదు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఏపీ ప్రభుత్వం తలపడుతోంది. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి హోదాలో నేరుగా సీఎం జగన్ తలపడుతున్నారు.
ఏపీలో ఈ ఇద్దరి మధ్య సంఘర్షణ పతాక స్థాయికి చేరుకుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకూడదు అని జగన్ సర్కార్ డిసైడ్ అయితే తాను ఉన్నప్పుడే ఎన్నికలు పెడతాను అని ఆయన గట్టిగానే ఉన్నారు. అయితే తాజాగా సుప్రీం కోర్టులో కూడా ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో ఎన్నికల కమిషన్ మాత్రం యమస్పీడ్ గా తమ పని చేసుకుపోతుంది. ఇదిలా ఉంటే రాజ్యాంగంలో ఏ వ్యవస్థకు గొప్పదనం ఆ వ్యవస్థకు ఉంది.
అదే విధంగా ఏ వ్వవస్థ కూడా మరో దాని కంటే ఎక్కువ కాదు, ఈ నేపధ్యంలో సమిష్టి స్పూర్తినే రాజ్యాంగం పొందుపరచారు. మరి ఆ స్పూర్తి మాత్రం ఇపుడు ఏపీలో చూసుకుంటే ఎక్కడా కనిపించడంలేదు. రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రమాణం చేసి బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఆ రాజ్యాంగ స్పూర్తి నుంచి పక్కకు తొలగిపోతే రాజ్యాంగ సంక్షోభమే తలెత్తుతుంది. ఏపీలో చూసుకుంటే ఇపుడు అదే సీన్ కనిపిస్తోంది. అయితే నిమ్మగడ్డ వర్సెస్ జగన్ కేసులో ఎవరికి ఎక్కువ నష్టం కష్టం అన్న చర్చకు వచ్చినపుడు మాత్రం కచ్చితంగా జగన్ సర్కార్ కే ముప్పు అన్న మాట వినిపిస్తోంది. జగన్ 151 సీట్లో ఎన్నుకోబడిన వారు. ఆయన ప్రభుత్వానికి ఇంకా మూడున్నరేళ్ళ కాలం అధికారంలో ఉండే అవకాశం ఉంది. అదే నిమ్మగడ్డను తీసుకుంటే ఈ మార్చి 31 నాటికి ఆయన పదవీ విరమణ చేస్తారు. ఒక వేళ ఆయన కొనసాగినా కూడా నష్టం ఆయనకు ఎపుడూ పెద్దగా ఉండదు. ప్రభుత్వ పెద్దలు దీనిపై ఓ సారి ఆలోచిస్తే