మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పాదయాత్ర చేయాలని అనుకుంటున్నా ఆయనకు వయస్సు సహకరించడం లేదు. లోకేశ్ ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్ర చేయనుండగా లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే చర్చ కూడా జరుగుతోంది. లోకేశ్ పాదయాత్ర ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే ఏం చేయాలనే విషయంలో కూడా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
చంద్రబాబుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండగా తనకు ఎదురవుతున్న సమస్యలకు ఏ విధంగా చెక్ పెట్టాలనే విషయంలో కూడా చంద్రబాబు క్లారిటీతో ఉన్నారు. 2024 ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ భారీ స్థాయిలో ఖర్చు చేయనుందని తెలుస్తోంది. చంద్రబాబుకు అనుకూలంగా ఉండే వాళ్లు కూడా ఈ విషయంలో చంద్రబాబుకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినా జగన్ స్థాయిలో పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని ఇప్పటికే ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలనే అమలు చేయాలని అయితే లబ్ధిదారుల సంఖ్యలో భారీ స్థాయిలో కోత విధించాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులకు సీట్ల విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని సమాచారం అందుతోంది.
చంద్రబాబు వ్యూహాలకు వ్ జగన్ సర్కార్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందో తెలియాల్సి ఉంది. జగన్ సర్కార్ వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.