కేసీఆర్ కు జగన్ సపోర్ట్.. ఇంతకు మించి సాక్ష్యం అవసరం ఉందా?

YCP Running

జగన్ కేసీఆర్ మంచి స్నేహితులు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొలిటికల్ గా కొన్ని విభేదాలు ఉన్నా అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో జగన్ కేసీఆర్ ఒకరికొకరు తమ వంతు సహాయసహకారాలు అందించుకుంటారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరుగుతుండగా ఈ సభకు ఆర్టీసీ ఎన్ని అద్దె బస్సులు కావాలంటే అన్ని అద్దె బస్సులను కేటాయిస్తోంది. వందల సంఖ్యలో అద్దె బస్సులను ఆర్టీసీ కేటాయించడం హాట్ టాపిక్ అవుతోంది.

మహానాడుకు బస్సులను కేటాయించని జగన్ సర్కార్ బీఆర్ఎస్ సభ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో టీడీపీ జనసేనలకు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వైసీపీ మధ్య మధ్య చెలిమికి ఇంతకు మించిన సాక్ష్యాలు అవసరం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కు చెక్ పెట్టాలనేదే జగన్ ఆలోచన కాగా కేసీఆర్ ద్వారా ఆ పని సులువు అవుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల స్నేహం గురించి ఇతర పార్టీల నేతలు ఏ విధంగా స్పందిస్తారనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం.

అయితే జగన్, కేసీఆర్ కలిసి కనిపిస్తే మాత్రమే విమర్శలు వ్యక్తమవుతాయని తెలుస్తోంది. చంద్రబాబు, కేసీఆర్ మధ్య గ్యాప్ ఉండగా ఆ గ్యాప్ వల్ల చంద్రబాబు కేసీఆర్ కలిసే అవకాశాలు కనిపించడం లేదు. 2024 ఎన్నికల ఫలితాలను పొత్తులు డిసైడ్ చేయనున్నాయని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. కేసీఆర్ కు జగన్ సపోర్ట్ ఉందని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఉందా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.