వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఏ ముఖ్యమంట్రీ పడని చిత్రమైన కష్టాన్ని జగన్ పడుతున్నారు. అదే రాజ్యాంగ వ్యవస్థ అయినా ఎన్నికల సంఘంతో గొడవ. నిజానికి ఇక్కడ స్వాతంత్య్ర వ్యవస్థ అయిన ఎన్నికల సంఘంతో జగన్ కు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఉన్నదల్లా ఆ సంఘానికి కమీషనర్ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో గొడవ. నిమ్మగడ్డ మొదటి నుండి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు. కరోనా పేరు చెప్పి స్థానిక ఎన్నికలను మధ్యలోనే నిలిపివేశారు. నిమ్మగడ్డ తీరును అప్పుడే పసిగట్టిన జగన్ ఆయన్ను పదవి నుండి దింపేసే ప్రయత్నం చేశారు. కానీ నిమ్మగడ్డ కోర్టు ద్వారా మళ్ళీ పదవిలోకి వచ్చి కూర్చున్నారు.

మరి అప్పటికైనా ఆయన మారారా అంటే లేదు. వివాదాన్ని మరింత పెద్దది చేసుకున్నారు. ప్రభుత్వ సలహాలను, నిర్ణయాలను పట్టించుకుందా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారు. చివరికి ఏమైంది.. హైకోర్టు ఉత్తర్వులు చెల్లవని తీర్పునిచ్చింది. సరే ఇక్కడైనా ఆయనలో మార్పు వచ్చిందా అంటే లేదు. హైకోర్టు కోర్టు తీర్పు మీద డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ దాఖలు. అత్యవసర విచారణ కావాలని కోరారు. ఇక్కడ కూడ కుదరకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లాలని అనుకుంటున్నారు. అక్కడ కూడ ఎదురుదెబ్బ తగిలితే మరొక ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అదే పదవీ కాలం పొడిగింపు.
నిమ్మగడ్డ త్వరలో రిటైర్ అవ్వబోతున్నారు. ఆయన దిగిపోతే ఎన్నికలు పెట్టుకోవాలనేదే ప్రభుత్వం ఉద్దేశ్యం. అందుకే ఇంత గొడవ. చివరికి ప్రభుత్వానిదే పైచేయి అయింది. అయితే నిమ్మగడ్డ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేతుల మీదుగానే ఎన్నికలు జరపాలని డిసైడ్ అయి పదవీ కాలాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారట. గతంలో తనను నిబంధనలకు విరుద్దంగా పదవి నుండి తొలగించారని, దాని మూలంగా తాను మూడు నెలలు పదవికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, కాబట్టి తన పదవీ కాలం ఇంకో మూడు నెలలు పెంచాలని ఆయన కోర్టును కోరనున్నారట. చూడబోతే నిమ్మగడ్డ అంత సులభంగా ఈ వ్యవహారాన్ని వదిలేలా లేరు. మరి ఆయన ప్రయోగించనున్న ఈ చివరి అస్త్రం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
- Advertisement -