‘ నిమ్మగడ్డా నీ సంగతి తేలుస్తా ‘ చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ?

Chandrababu Naidu has not yet repented

రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో జరుగుతున్న అధికార పార్టీ అరాచకాలు, గత నాలుగు రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ వైఖరి మారటంతో, తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న పత్రికా సమావేశం పెట్టిన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు కొన్ని మండలాల్లో ఒక్క నామినేషన్ కూడా పడకుండా చూస్తున్నారని అన్నారు. బలంతపు ఎకగ్రీవాలు చేస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఎవరిని ఎన్నుకోవాలో, ఎంచుకునే స్వేఛ్చ కూడా ప్రజలకు లేదని అన్నారు. వైసిపీ చేస్తున్న అరాచకాలు ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కు పంపిస్తున్నా, ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని అన్నారు.

Chandrababu Naidu not afraid of them  
Chandrababu Naidu  

పోలీసులను విచ్చలవిడగా వాడుతూ అరాచకం చేస్తున్నారని అన్నారు. ఎస్ ఐ లు, సిఐలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని, కేసులు పెడతాం అని వేధిస్తున్నారని, భయపెడుతున్నారని అన్నారు. ఒక మంత్రి, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటిస్తే బెదిరిస్తాం అని చెప్తుంటే, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ చోద్యం చూస్తున్నారని అన్నారు. ఇక ఎన్నికల కమిషన్ కూడా తమ అధికారాలను ఉపయోగించలేక పోతుందని చంద్రబాబు అన్నారు. కేవలం పుంగనూరులో జరుగుతున్న అరాచకాలకు సంబంధించి, ఇప్పటికి ఏడు లేఖలు పంపానని, ఎలక్షన్ కమిషన్ దగ్గరకు అభ్యర్ధులను కూడా పంపామని చంద్రబాబు అన్నారు.

దేనికీ స్పందన లేదని చంద్రబాబు అన్నారు. ఆన్లైన్ నామినేషన్ల విషయంలో, ఎందుకు వెనకడుగు వేసారో అర్ధం కావటం లేదని చంద్రబాబు అన్నారు. పుంగనూరులో 23 వుంటే 23 ఏకగ్రీవం చేసుకున్నారని, అలాగే రొంపిచర్లలో 10 నామినేషన్లు వేస్తే పది తిరస్కరించి మొత్తం ఏకగ్రీవం చేసుకున్నారని, సోమల్ లో 15 వుంటే మొత్తం 15 ఏకగ్రీవం చేసుకున్నారని, చౌడేపల్లిలో 17 వుంటే 14 బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారని, 85 పంచాయతీల్లో 82 ఏకగ్రీవాలు చేసుకన్నారని చంద్రబాబు అన్నారు. ఇంత విపత్కర పరిస్థితిలో ఎన్నికలకు వెళ్తున్నామని, ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలం అయ్యిందని చంద్రబాబు అన్నారు. ఈ అరాచకాల పై, ఈసికి దిశానిర్దేశం చేయమని, హైకోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. అరాచకాలు చేసి, ఏకాగ్రీవాలు చేసుకున్న చోట, ఈసీ పట్టించుకోక పొతే, హైకోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు.