నిజం.! ఏబీఎన్ రాధాకృష్ణకి కుల పిచ్చి లేనే లేదు.!

జోక్ ఆఫ్ ది మిలీనియం అనాలా.? అని చాలామంది పడీ పడీ నవ్వుతున్నారు ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తనకు కుల పిచ్చి లేదని చెప్పుకోవడం చూసి. ఆంధ్రజ్యోతి – ఏబీఎన్ వార్షికోత్సవం నేపథ్యంలో వేమూరి రాధాకృష్ణ తమ సంస్థ గురించి బహు గొప్పగా చెప్పేసుకున్నారు.

తెలుగుదేశం పార్టీకి ఏనాడూ తమ మీడియా సంస్థ వత్తాసు పలకనే లేదట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను బాగా ప్రమోట్ చేసిందట. ‘గాడ్ ఫాదర్’ సినిమాపై నెగెటివ్ ప్రచారం, రాధాకృష్ణ దృష్టికి వెళ్ళలేదట.. కింది స్థాయి సిబ్బంది చేసిన పొరపాటు అట.

వామ్మో, ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పగలుగుతారు.? బహుశా వేమూరి రాధాకృష్ణ నేర్చుకున్న జర్నలిజం ఇదే అయి వుంటుందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. అసలు ఈ రోజుల్లో జర్నలిజంలో ఎథిక్స్ ఎక్కడ వున్నాయ్.? మీడియా రంగంలో కుల జాడ్యాన్ని తెచ్చింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అంటూ నిందారోపణలు చేసేశారు ఏబీఎన్ రాధాకృష్ణ. అసలంటూ మీడియాలో కులజాడ్యం మొదలైందే ఏబీఎన్ రాకతో కదా.?

దుష్ప్రచారం అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఏబీఎన్ మారిపోయిందన్నది జగమెరిగిన సత్యం. వార్షికోత్సవ సంబరాల క్రమంలోనూ ఏబీఎన్ రాధాకృష్ణ అబద్ధాల విషయంలో అస్సలేమాత్రం తగ్గలేదు. ప్రభుత్వాలు తమ మీద శీతకన్నేసినా స్వయంగా నిలదొక్కుకున్నామన్నది ఏబీఎన్ వాదన. వామ్మో, ఇలాంటి జోకులు జబర్దస్త్ కామెడీ షోలో కూడా వుండవేమో.!

ఈ సుద్దులేవీ చెప్పకుండా, నాలుగు మంచి మాటలేవన్నా ఏబీఎన్ రాధాకృష్ణ.. తమ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా చెప్పి వుంటే, సీనియర్ జర్నలిస్టుగా ఆయన పట్ల కాస్తైనా గౌరవం వుండేదేమో ఎవరికైనా. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. అసలంటూ ఏబీఎన్ రాధాకృష్ణ నుంచి అలాంటివి ఎలా ఆశించగలం.?