అభివృద్ధి అందని ద్రాక్షే.. ఏపీ ప్రజలకు మరో ఐదేళ్లు కష్టాలు తప్పవా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలవడం వెనుక కూడా అభివృద్ధి నినాదం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఏపీలో అభివృద్ధి జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. జగన్ సర్కార్ పథకాలకే పూర్తిస్థాయిలో నిధులు కేటాయించడం వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదు. మరోవైపు ఏపీలో పథకాల అమలు సైతం కష్టమవుతోందని తెలుస్తోంది.

 

ఇప్పటికే ప్రకటించిన పలు పథకాలకు డబ్బులు కేటాయించే విషయంలో జగన్ సర్కార్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ అప్పులకు సంబంధించిన వడ్డీల భారం కూడా ప్రభుత్వంపై అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ప్రభుత్వంకు ఈ అప్పుల వల్ల ఇబ్బందులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

 

జగన్ సర్కార్ కు కొత్త అప్పులు సైతం దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. జగన్ సర్కార్ ఉద్యోగులకు వేతనాలను చెల్లించడం విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జగన్ సర్కార్ ఆర్థిక ఇబ్బందులు రాకుండా ముందడుగులు వేయాల్సి ఉంది. జగన్ సర్కార్ పథకాల విషయంలో మంచి పేరును తెచ్చుకుంటున్నా ఆర్థికంగా మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం.

 

జగన్ సర్కార్ ఇదే విధంగా అప్పులు చేస్తే రాష్ట్రం మరో శ్రీలంక, పాకిస్తాన్ అవుతుందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. తమ ప్రభుత్వంపై వస్తున్న విమర్శల గురించి జగన్ సర్కార్ ఏ విధంగా సంతృప్తికరమైన సమాధానం ఇస్తుందో చూడాల్సి ఉంది. ఏపీలో అభివృద్ధి జరగాలంటే మరో ఐదేళ్లు ఎదురుచూడాల్సిందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.