జగన్ కు ఇదేం ఖర్మ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సీఎం మాట వినడం లేదా?

ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి జగన్ పై వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. సీఎం జగన్ కు ఇదేం ఖర్మ అంటూ ప్రజలు భావించాల్సిన పరిస్థితి నెలకొంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వం పరువు తీసేలా కామెంట్లు చేయడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కు కొరకరాని కొయ్యల్లా తయారవుతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్లు ప్రజల దృష్టిలో ప్రభుత్వం చులకన కావడానికి కారణం అవుతున్నాయని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కొన్నిరోజుల క్రితం ఒక ఎమ్మెల్యే విశాఖను చిన్న రాష్ట్రంగా చేయాలని చేసిన కామెంట్లు రాష్ట్రంలో సంచలనం అయ్యాయి.

ఆ తర్వాత ఆ వైసీపీ ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదని విచిత్రమైన కామెంట్లు చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి జగన్ సర్కార్ రాష్ట్రంలో అభివృద్ధి చేయకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఆనంకు చెక్ పెట్టే దిశగా వైసీపీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీకి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో కామెంట్లు చేస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తాజాగా ఉయ్యూరు శ్రీనివాస్ మంచి వ్యక్తి అంటూ కామెంట్లు చేశారు. వైసీపీ నేతలే వైసీపీ పరువు పోయే విధంగా అడుగులు వేస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు ఇప్పటికైనా మారతారో లేదో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ ఇలాంటి ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.