జగన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కు భయమా..?

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని చాలామంది భావిస్తున్నారు. అయితే కొన్ని వివాదాస్పద విషయాలకు సంబంధించి తారక్ స్పందిస్తున్న తీరు చూస్తుంటే తారక్ కు రాజకీయాలపై అస్సలు ఆసక్తి లేదని క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై తారక్ స్పందిస్తూ ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టడం ద్వారా వైఎస్సార్ స్థాయి పెరగదంటూ ఆయన కామెంట్లు చేశారు.

అయితే జగన్ సొంత చెల్లి షర్మిల ఈ విషయంలో జగన్ ను తప్పుబట్టారు. ఈ విధంగా చేయడం వల్ల ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో చేరి చదువు పూర్తి చేసిన వాళ్లకు సర్టిఫికెట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హుందాగా స్పందించారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తారక్ తనపై వ్యక్తమవుతున్న విమర్శలను సైతం గమనించాల్సి ఉంది.

కొత్త యూనివర్సిటీలను కట్టించి ఆ యూనివర్సిటీలకు జగన్ వైఎస్సార్ పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. జగన్ పై నెగిటివ్ గా కామెంట్లు చేస్తే భవిష్యత్తులో తన సినిమాల విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని జూనియర్ ఎన్టీఆర్ భావించి ఉండవచ్చు. అయితే సినీ కెరీర్ కోసం తారక్ ఇలా స్పందించడం అభిమానులకు మాత్రం నచ్చడం లేదు.

గతంలో భువనేశ్వరి వివాదం సమయంలో తారక్ స్పందించిన తీరు గురించి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ తన స్పందన ద్వారా తనకు రాజకీయాలపై అస్సలు ఆసక్తి లేదనే సంకేతాలను ఇచ్చారు. తారక్ స్పందన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2009లో విమర్శలు చేసిన తారక్ కు ఈ తారక్ కు పొంతనే లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.