ఆస్పత్రుల పేర్లు మార్చడం అవసరమా జగన్.. విమర్శలు వినిపించట్లేదా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ కొన్ని విషయాలకు సంబంధించి మొండిగా ముందుకెళుతున్నారు. అయితే జగన్ అదే సమయంలో ప్రజల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వివాదం వైసీపీ ఎమ్మెల్యేలలో కొంతమందిని బాధించిందనే సంగతి తెలిసిందే. పరోక్షంగా జగన్ నిర్ణయం తమకు నచ్చలేదని చాలామంది సంకేతాలు ఇచ్చారు.

అయితే ప్రస్తుతం ఆస్పత్రి పేరు మార్చడం ద్వారా వైసీపీ వార్తల్లో నిలిచింది. విజయనగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో మహారాజా ఆస్పత్రి కూడా ఒకటి. అయితే ఏపీ ప్రభుత్వం ఈ ఆస్పత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మార్చడం గమనార్హం. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో విజయనగరం ప్రజలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

జగన్ సర్కార్ ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గాలని విజయనగరం ప్రజలు కోరుకుంటుండగా ఈ కామెంట్ల విషయంలో వైసీపీ సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. టీడీపీ నేతలు ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు మహారాజా కేంద్ర ఆస్పత్రి పేరు రాత్రికి రాత్రి మార్చేసి జగన్ సర్కార్ ప్రజలలో చులకన అవుతుండటం గమనార్హం.

ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా జగన్ సర్కార్ ఈ విధంగా చేయడం ఏమిటని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మహారాజా రాజవంశంను అవమానించే విధంగా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటూ పరువు పోగొట్టుకుంటోందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.