జగన్ బాట పట్టిన నేదురుమల్లి బ్యాచ్…

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పుంజుకుంటూ ఉంది. పార్టీలోకి చాలా మంది నేతలు వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే అక్కడ పార్టీ బలంగా ఉంది. ఈ కొత్త చేరికలతో  జిల్లా పార్టీలో నూతనోత్సాహం కనబడుతుంది. మొన్న  ఆనం రామ్ నారాయణ్ రెడ్డి చేరిన సంగతి తెలిసిందే. జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబం ఆనం కుటుంది. ఆ కుటుంబం ఇపుడు వైసిపి కి మద్దతుగా నిలిచింది. ఇపుడు మరొక కుటుంబం వైసిపికి దన్నుగా నిలబడుతున్నది. అదే నేదురుమల్లి కుటుంబం. ఒకపుడు  కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న నేదురుమల్లి కుటుంం ఆయన మరణానంతరం రాజకీయ అనిశ్చితిలో పడిపోయింది.  పెద్దాయన మరణం తరువాత  ఒక కుమారుడు రాంకుమార్ రెడ్డి  భారతీయ జనతా పార్టీ లో చేరారు. బిజెపి కాదు,  వైసిపి అసలు రాజకీయ పార్టీ అని భావించి ఆయన ఇపుడు వైసిపిలోకి వస్తున్నారు. 

దానికి రంగం ఎట్టకేలకు సిద్ధం అయ్యింది.  సెప్టెంబర్ 8వ తేదీన, విశాఖ జిల్లాలో జరుగుతున్న జగన్ పాదయాత్రలో వైకాపా పార్టీలో చేరేందుకు నేదురుమల్లి అనుచరులు ఈరోజు విశాఖపట్నం జిల్లాకు పెద్ద సంఖ్యలో వాహనాల్లో బయలుదేరారు.

నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి రాకతో జిల్లా పార్టీకి బలం చేకూరినా వెంకటగిరి నియోజకవర్గం లో మాత్రం టికెట్ కోసం పోటీ తీవ్రమవుతున్నది. రాంకుమార్ రాకతో   ఈ టికెట్ కోసం చతుర్ముఖ పోటీ మొదలయింది. ఇప్పటికే నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కెఆఱ్ పి ఆర్  ఛారిటబుల్ ట్రస్టు  కలిమిలి రాంప్రసాద్ రెడ్డి,  ఇటీవలే వైసిపి తీర్థం పుచ్చుకున్న ఆనం రామనారాయణ రెడ్డి, కూడా ఈ టికెట్రే కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ పోటీలో నేదురుమల్లి రాంకుమార్ కూడా చేరుతున్నారు.  

2019 ఎన్నికల్లో… వీరిలో ఎవరికి వైసిపి టికెట్ దక్కనుంది జిల్లాలో ఆసక్తి కరమయిన చర్చ సాగుతూ ఉంది. అందరి కళ్లు వెంకటగిరిమీద ఉన్నాయి. ఈ ఉత్కంఠని జగన్ ఎంతకాలం కొనసాగిస్తాడో తెలియడం లేదు…