ఈసారి “న్యాయానికి సంకెళ్లు”.. నెక్స్ట్ “చట్టానికి కళ్లులేవు”?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పటి నుంచీ ఆయన అరెస్టుకు నిరసనగా నారా లోకేష్ ఆధ్వర్యంలో. టీడీపీ శ్రేణులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఏపీలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ కార్యక్రమాలకు నామకరణాలు ఎవరు చేస్తున్నారు.. అసలు ఈ కార్యక్రమాలను ఎవరు ప్లాన్ చేస్తున్నారు అనేది మరింత చర్చనీయాంశం అవుతుంది.

అవును… చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ చిత్ర విచిత్రమైన పేర్లతో నిరసన ప్రదర్శనలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఇప్పటికే కంచాలను గరిటెలతో వాయించడం, విజిల్స్ వేయడం, హారన్లు కొట్టడం, గంట కొట్టడం, డోలు కొట్టండం, విద్యుత్ లైట్లు ఆపేసి కొవ్విత్తులు వెలిగించడం, నూనె దీపాలు పెట్టడం వంటివి చేశారు. ఈ ఫ్లోని కంటిన్యూ చేస్తూ హైదరబాద్ లో మెట్రో రైళ్లలో నల్లటి దుస్తుల్లో ప్రయాణించారు.

అదంతా ఒకెత్తు అంటే… ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కొత్త నిరసన ఒకటి చేర్చారు నారా లోకేష్. అందులో భాగంగా ఆ కార్యక్రమానికి “న్యాయానికి సంకెళ్లు” అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమం కాన్సెప్ట్ ఏమిటంటే… చేతికి తాళ్లు, రిబ్బన్లు కట్టుకుని వీడియోలు, ఫొటోలు తీయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేయాలి. ఈ మేరకు లోకేష్ ట్విట్టర్ లో మరింతగా ఎక్స్ ప్లైన్ చేస్తూ, గైడ్ చేస్తున్నారు.

“చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించి, న్యాయానికి సంకెళ్లు వేసిన జగన్‌ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఈనెల 15 (ఆదివారం) రాత్రి 7 గంటల నుంచి 7:05 నిమిషాల మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బను కట్టుకొని నిరసన తెలియజేయాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు నారా లోకేష్. “న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లు” అంటూ నినాదాలు చేయాలని కోరారు.

ఇదే సమయలో చేతికి తాళ్లు, రిబ్బన్లు కట్టుకున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి చంద్రబాబు పోరాటానికి మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులను, అభిమానులను కోరారు. దీంతో… ఇది సూపర్ కార్యక్రమం అని లోకేష్ అభిమానులు అంటుంటే… మరికొంతమంది మాత్రం.. నెక్స్ట్ వీక్ “చట్టానికి కళ్లులేవు” అనే కార్యక్రమంలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని 7 – 7:5 రోడ్లపైన నడవాలేమో అంటూ కామెంట్ చేస్తున్నారు.