ఈ దెబ్బతో టీడీపీలో నందమూరి కుటుంబం పేరు కనుమరుగైనట్టేనా ! 

Nandamuri Family losing grip over TDP,
నిజానికి తెలుగుదేశం పార్టీ నందమూరి కుటుంబ వారసులది.  మధ్యలో నారా  చంద్రబాబు నాయుడు ఎన్ఠీఆర్ కుటుంబంలోకి అల్లుడిగా ప్రవేశించడంతో, పరిస్థితులను, వ్యక్తులను తనకు అనుకూలించేలా చేసుకోవడంతో పార్టీ కాస్త నారావారి వశమైంది.  ఎన్టీఆర్ తర్వాత నందమూరి రెండవ తరం వారసులకు పార్టీ పగ్గాలు అందాల్సి ఉన్నా  బాబుగారు అందనివ్వలేదు.  ఇకపై కూడ అందనివ్వరు.  ఎందుకంటే నారా కుటుంబం నుండి రెండవ తరం వారసుడిగా నారా లోకేష్  ఉన్నారు.  పార్టీ పగ్గాలు ఆయన చేయి దాటిపోయే పరిస్థితి లేదు.  అలా జరిగే ప్రమాదం రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేశారు బాబుగారు.  దీంతో పార్టీలో  నెంబర్ వన్ స్థానంలో ఉండాల్సిన నందమూరి కుటుంబం నెంబర్ 2 స్థానానికి పరిమితమైపోయింది.  
Nandamuri Family losing grip over TDP
Nandamuri Family losing grip over TDP
అయితే ఇప్పుడు ఆ రెండవ స్థానానికి కూడ ముప్పు వాటిల్లనుంది.  కారణం పార్టీలో ఇంకోక కుటుంబం వేళ్ళు బలంగా పాతుకుంటున్నాయి.  అదే కింజారపు  కుటుంబం.  శ్రీకాకుళం దిగ్గజ నేత ఎర్రన్నాయుడు కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో ప్రముఖ స్థానం ఉంది.  ఎన్టీఆర్ హయాం నుండి ఆ కుటుంబం టీడీపీని కనిపెట్టుకుని ఉంది.  ఎర్రన్నాయుడు మరణం తర్వాత ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్ నాయుడు కుటుంబం తరపున పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు.  వాళ్ళే లేకుంటే శ్రీకాకుళంలో పార్టీకి చాలా కష్టం.  అయితే ఎంత కీలకంగా ఉన్నా ఇన్నాళ్లు వాళ్ళను కొన్ని హద్దులు దాటి ఎదగనివ్వలేదు చంద్రబాబు.  కంట్రోల్ చేస్తూనే వచ్చారు. 
 
కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో ఆ కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది.  అచ్చెన్నాయుడుకు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.  ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎలాగూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.  ఈ ఇద్దరూ ఉత్తరాంధ్రలో పార్టీకి మూల స్థంబాలు అయిపోయారు.  చేతి నిండా పదవులు ఉండటంతో పార్టీలో వారి పరపతి బాగా పెరిగింది.  చంద్రబాబు తరవాత వారి పేర్లే వినబడుతున్నాయి.  అప్పటికీ చంద్రబాబు అచ్చెన్నాయుడు చుట్టూ గిరి గీసినా వాటిని దాటుకుని  రావాలని చూస్తున్నారు అచ్చెన్న.  వీరు చంద్రబాబును, లోకేష్ ను మించలేకపోయినా పార్టీలో నెంబర్ 2గా కొనసాగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.  అంటే భవిష్యత్తులో నందమూరి కుటుంబానికంటే వీరి  అవసరమే పార్టీకి ఎక్కువ ఉండేలా ఉంది.  అదే గనుక జరిగితే నందమూరి  కుటుంబం పేరు మరుగునపడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.