చంద్రబాబు ఢిల్లీ దీక్ష ఖర్చెంత?

ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తన ‘ఎన్నికల స్టంట్’ లో భాగంగా చేస్తున్న ఢిల్లీ దీక్ష కోసం  రాష్ట్రంలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని   ప్రతిపక్ష వైసిపి  విమర్శించింది.

చంద్రబాబు నాయుడు  ప్రజాధనంలో వెచ్చించి దీక్షలు సాగిస్తున్నారని ప్రధాని మోదీ కూడా విమర్శించారు. ఈ రోజు వైసిసి  రాజధాని ఢిల్లీలోని  ఆంధ్ర ప్రదేశ్ భవన్ ను తెలుగుదేశం పార్టీ భవన్ గా  మార్చడం పట్ల వైసిపి ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

నిజానికి ఎపి భవన్ అనేది  రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయం వంటిదని అయినా సరే తెలుగు తమ్ముళ్లు దానిని పార్టీ పోస్టర్లతో, ఫ్లెక్సీలతో పసుపు మయం చేసి టిడిపి కార్యాలయంగా మార్చారని ఆయన తెలుగు రాజ్యం తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు దీక్షకు దాదాపు పదికోట్ల దాకా ఖర్చవుతున్నదని ఆయన అన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో ఢిలీ వెళ్లారు.

తెలుగు తమ్ముళ్లను ఢిల్లీకి తరలిచేందుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. వీరందరికి ఢిల్లీ వేలాది రూంలు బుక్ చేశారు. ఈ ఖర్చుమొత్తం దాదాపు పదికోట్ల దాకా ఉంటుందని ఆయన అభిప్రాయం పడ్డారు. కేంద్రం నిధులివ్వలేదని ఒక వైపు విమర్శిస్తూ మరొక వైపు ఉన్ననిధులను ఇలా దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు.చంద్రబాబు దీక్ష ఎన్నికల దీక్ష అని విమర్శిస్తూ నాలుగున్నరేళ్లు ప్రత్యేక హోదాను ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని దీక్షలు చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని విశ్వేశ్వరెడ్డి అన్నారు.