ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో చేయబోతున్న దీక్షకు రెండుకోట్ల రుపాయలు పైబడి ఖర్చవుతున్నాయి.
ఈ డబ్బును విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాఇవ్వాలని కోరుతూ ఢిల్లీలో ముఖ్యమంత్రి ఫిబ్రవరి 11 వ తేదీన ఒక రోజు దీక్షకు పూనుకుంటున్నారు. ఈ దీక్షకు ఏర్పాట్లు చేేసేందుకు అవసరమయ్యే ఖర్చు ల కోసం రు.2 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కాకుండా ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకునేందుకు ప్రత్యేక విమానంలో వెళ్తారు. ఈ ఖర్చులు అదనం..
ఇందులో నుంచి రు. 1, 12,16,465 రుపాలయను విడుదల చేసింది కూడా. దీక్ష ను విజయవంతం చేసేందుకు రాష్ట్రం నలుమూలలనుంచి ప్రజలను సమీకరిస్తారు. వీరిని ఢిల్లీకి చేర్చేందుకు రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతారు. ఇందులో ఒకటి అనంతపురం నుంచి మరొకటి శ్రీకాకుళం నుంచి బయలుదేరుతాయి.ఈ రెండు రైళ్లు శుక్రవారమే బయలు దేరాయి. రేపు ఢిల్లీ చేరుకుంటాయి. జిఎడి ప్రొటోకోల్ అధికారుల లెక్కల ప్రకారం, శ్రీకాకుళం నుంచి బయలుదేరే రైలుకు రు.59,49,380 లు ఖర్చయితే, అనంతపురం రైలుకు రు. 42, 67,085 లు ఖర్చవుతాయి. ఈ రెండు రైళ్లకు చెరో రు.10లక్షలు రైల్వేకి సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించారు. (బ్యానర్ ఫైల్ ఫోటో)