ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయనందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వం నిరసన తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష ప్రారంభించారు.
ఉదయం ఎనిమిది గంటలకు మొదలయిన దీక్ష సాయంకాలం ఎనిమిది కాదా సాగుతుంది. ఢిల్లీ ఇలా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ భవన్ కేంద్రం దోరణిని నిరసిస్తూ దీక్ష చేయడం ఇది మొదటి సారికాదు. ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో యుపిఎ ప్రభుత్వం ఉన్నపుడు రాష్ట్రానికి న్యాయం జరగాలని దీక్ష జరిపారు.
ఇపుడు ఈ ఎన్డీయే ప్రభుత్వం మీద ఆయన పోరాటానికి దిగారు. దీనికి ధర్మపోరాట దీక్ష అని పేరు పెట్టారు. నల్ల చొక్కా ధరించి ఆయన దీక్షలో కూర్చున్నారు.
దీక్ష కు ముందు చంద్రబాబు నాయుడు రాజ్‌ఘాట్ వెళ్లి మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. అదే విధంగా ఏపీ భవన్‌లోనే ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. దీక్షా వేదికపై గాంధీ, అంబేడ్కర్, ఎన్టీఆర్ చిత్ర పటాలను ఉంచారు. ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో రాష్ట్రం నుంచి తెలుగుదేశం కార్యకర్తులు నేతలు హాజరవుతున్నారు. ప్రత్యేక రైళ్లలో వారిని తరలించారు.
చంద్రబాబునాయుడి పలు జాతీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో జాతీయపార్టీలనేతలు ఎపి భవన్ కు వచ్చిన స్వయంగా బాబుకు మద్దతు తెలపనున్నారు.తన ధర్మ పోరాట దీక్షకు మద్దతు తెలపాలని కోరుతూ ముఖ్య మంత్రి జాతీయ,ప్రాంతీయ పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, లోక్‌సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, డీఎంకే నేత కనిమొళి, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా, బీఎస్పీ అధినేత్రి మాయావతి వంటి నేతలున్నారు.
కార్యక్రమానికి వచ్చే వారికోసం 45 బస్సులతో పాటు వసతి ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు. రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు ల్లీకి ఢిల్లీకి వస్తున్నారని, వారికోసం దాదాపు 800 గదులు సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు.